టీమ్‌ఇండియా వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాకు(Wriddhiman Saha) ఆసీస్ విధ్వంసకర ఆటగాడు డేవిడ్ వార్నర్(warner) ఓ ప్రశ్న వేశాడు! 'ఆ గది నంబర్ 318?' కదా అని అడిగాడు. ఎందుకంటారా? సాహా సౌథాంప్టన్ మైదానం ఫొటోను పంచుకోవడమే కారణం.
ముంబయిలో క్వారంటైన్ అయిన టీమ్‌ఇండియా(TeamIndia) మహిళల, పురుషుల జట్లు ఒకే విమానంలో ఇంగ్లాండ్కు బయలుదేరారు. వీరంతా లండన్ చేరుకున్నారు. అక్కడి నుంచి సౌథాంప్టన్ మైదానానికి వెళ్లారు. ఎందుకంటే అక్కడ హోటళ్ల సదుపాయం ఉండటమే కారణం. ఆటగాళ్లంతా తమ తమ గదుల్లోకి వెళ్లాక అక్కడి చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.