ఆరంభ మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎళ్) వేలంలో టీమ్ ఇండియా ప్లేయర్ స్మృతి మంధాన భారీ ధరకు అమ్ముడైంది. ముంబయి ఇండియన్స్, ఆర్సీబీ మధ్య పోటాపోటీగా జరిగిన వేలంలో చివరకు బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ రూ. 3.4 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే, ఈ పీఎల్ వేలంలో తన బేస్ ప్రైస్‌ను రూ. 50లక్షలగా నిర్ణయించుకుంది స్మృతి మధాన. ఇక, టీమ్ఇండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్‌ను రూ. 1.8 కోట్లకు మంబయి జట్టు దక్కించుకుంది. ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ యాష్ గార్డనర్‌ను రూ.3.2 కోట్ల భారీ ధరకు గుజరాత్ జెయింట్స్ కొనుగోలు చేసింది. ఇక ఈ వేలంలో మొత్తం 90 స్థానాల కోసం 409 మంది క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అందులో 246 మంది దేశీయ ప్లేయర్లు.. 163 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు.
Wpl Auction 2023 : భారీ ధరకు అమ్ముడైన స్మృతి మంధాన.. ఏ జట్టులో ఎవరంటే? - డబ్ల్యూపీఎల్ వేలం 2023 షెఫాలీ వర్మ
మహిళల ప్రీమియర్ లీగ్ వేలం కొనసాగుతోంది. స్మృతి మంధానను రికార్డు స్థాయిలో రూ. 3.40 కోట్లకు ఆర్‌సీబీ దక్కించుకుంది. హర్మన్‌ప్రీత్ కౌర్‌ను రూ.1.8 కోట్లకు ముంబయి దక్కించుకుంది. అమ్ముడైన ప్లేయర్లు వీళ్లే..
wpl auction
ఎవరు ఎంత ధర పలికారంటే..
- స్మృతి మంధాన( ఆర్సీబీ) - రూ. 3.4 కోట్లు
- నటాలీ సివర్( ముంబయి) - రూ. 3.2 కోట్లు
- అస్లీ గార్డనర్(గుజరాత్) - రూ. 3.2 కోట్లు
- దీప్తి శర్మ( యూపీ వారియర్స్) - రూ. 2.6 కోట్లు
- జెమీమా రోడ్రిగ్స్ (దిల్లీ క్యాపిట్ల్) - రూ. 2.2 కోట్లు
- బెత్ మూనీ (గుజరాత్) - రూ. 2 కోట్లు
- షెఫాలీ వర్మ(దిల్లీ) - 2 కోట్లు
- పూజ వస్త్రాకర్(ముంబయి) - 1.9 కోట్లు
- రిచా ఘోష్(ఆర్సీబీ) - రూ. 1.9 కోట్లు
- సోఫీ ఎక్లెస్టోన్( యూపీ వారియర్స్) - రూ. 1.8 కోట్లు
- హర్మన్‌ప్రీత్(ముంబయి) - రూ. 1.80 కోట్లు
- ఎలిసీ పెర్రీ( ఆర్సీబీ) - రూ. 1.70 కోట్లు
- రేణుకా సింగ్( ఆర్సీబీ) - రూ. 1.50 కోట్లు
- యాస్తికా భాటియా(ముంబయి) - రూ. 1.5 కోట్లు
- తలియా మెక్‌గ్రాత్(యూపీ వారియర్స్) - రూ. 1.4 కోట్లు
- మెగ్ లానింగ్(దిల్లీ) - రూ. 1.1 కోట్లు
- షబ్నిమ్ ఇస్మాయిల్(యూపీ వారియర్స్) - రూ. 1 కోటి
- అమేలియా కెర్(ముంబయి) - రూ. 1 కోటి
- అన్నాబెల్ సదర్‌ల్యాండ్(గుజరాత్) - రూ. 70 లక్షలు
- అలిస్సా హేలీ(యూపీ వారియర్స్) - రూ. 70 లక్షలు
- ఇవీ చదవండి :
- రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్
- IND vs AUS: మూడో టెస్టు వేదిక మార్పు.. ఇక అదే ఫైనల్.. బీసీసీఐ అధికార ప్రకటన
Last Updated : Feb 13, 2023, 5:16 PM IST