మహిళల ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ అట్టహాసంగా ముగిసింది. తొలి విజేతగా ముంబయి ఇండియన్స్ జట్టు రికార్డు సృష్టించింది. దిల్లీ క్యాపిటల్స్‌తో సాగిన ఫైనల్ మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. మొట్టమొదటి డబ్ల్యూపీఎల్ ట్రోఫీని హర్మన్ సేన.. ముద్దాడి సంబరాల్లో మునిగిపోయింది. మహిళా క్రికెట్‌లో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతూ బీసీసీఐ.. ప్రవేశపెట్టిన డబ్ల్యూపీఎల్ తొలి సీజన్‌ను మధుర జ్ఞాపకంగా మిగుల్చుకుంది. ఇక ఈ విజయంతో ఛాంపియన్ ముంబయి, వివిధ విభాగాల్లో సత్తా చాటిన క్రికెటర్లు గెలుచుకున్న ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా?
డబ్ల్యూపీఎల్ 2023 అవార్డులు, ప్రైజ్‌మనీ వివరాలు ఇలా..
- విజేత- ముంబయి ఇండియన్స్- గోల్డెన్ ట్రోఫీ- రూ. 6 కోట్లు
- రన్నరప్-దిల్లీ క్యాపిటల్స్ - రూ. 3 కోట్లు
- మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్-హేలీ మాథ్యూస్ (ముంబయి ఇండియన్స్)- రూ. 5 లక్షలు
- ఆరెంజ్ క్యాప్(అత్యధిక పరుగులు)- మెగ్ లానింగ్ (దిల్లీ క్యాపిటల్స్)- 9 ఇన్నింగ్స్‌లో 345 పరుగులు- రూ. 5 లక్షలు
- పర్పుల్ క్యాప్(అత్యధిక వికెట్లు)- హేలీ మాథ్యూస్ (ముంబయి ఇండియన్స్)- 16 వికెట్లు
- ఫెయిర్ ప్లే అవార్డు- ముంబయి ఇండియన్స్, దిల్లీ క్యాపిటల్స్
- క్యాచ్ ఆఫ్ ది సీజన్-హర్మన్ ప్రీత్ కౌర్ (ముంబయి)- యూపీ వారియర్జ్ దేవికా వైద్య క్యాచ్- రూ. 5 లక్షలు
- సఫారీ పవర్‌ఫుల్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్-సోఫీ డివైన్ (ఆర్సీబీ)- 8 ఇన్నింగ్స్‌లో 13 సిక్సర్లు- రూ. 5 లక్షలు
- ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్- యస్తికా భాటియా (ముంబయి)- రూ. 5 లక్షలు