తెలంగాణ

telangana

ETV Bharat / sports

WPL 2023: ఉత్కంఠ మ్యాచ్​లో గుజరాత్​పై విజయం.. ప్లే ఆఫ్స్​కు యూపీ వారియర్స్ - Gujarat Giants loss the match against UP Warriorz

డబ్ల్యూపీఎల్‌ భాగంగా నేడు(మార్చి 20) జరిగిన మొదటి మ్యాచ్​లో గుజరాత్ జెయింట్స్‌పై యూపీ వారియర్స్​ గెలిచింది. ఉత్కంఠగా సాగిన మ్యాచ్​లో మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

UP Warriorz won the match
గుజరాత్ జెయింట్స్‌పై యూపీ వారియర్స్​ విజయం

By

Published : Mar 20, 2023, 6:56 PM IST

Updated : Mar 20, 2023, 7:39 PM IST

డబ్ల్యూపీఎల్‌ భాగంగా నేడు(మార్చి 20) జరిగిన మొదటి మ్యాచ్​లో గుజరాత్ జెయింట్స్‌పై యూపీ వారియర్స్​ గెలిచింది. ప్లే ఆఫ్స్​ రేసులో నిలవాలంటే గెలవాల్సిన మ్యాచ్​లో.. మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ విజయంతో.. ప్రస్తుతం విజయంతో లీగ్​లో నాలుగో విజయాన్ని నమోదు చేసింది యూపీ. 179 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీ.. 39కే 3 వికెట్లు కోల్పోయినా.. గ్రెస్​ హ్యారిస్​(41 బంతుల్లో 72, 7x4, 6x4), తహ్లియా మెక్ గ్రాత్​(38 బంతుల్లో 57, 11x4 ) హాఫ్ సెంచరీల మెరుపులు.. చివర్లో సోఫీ ఎక్లిస్టోన్​(19*) రాణించడంతో.. ఒక్క బంతి మిగిలి ఉండగానే ఏడు వికెట్లు కోల్పోయి యూపీ విజయం సాధించింది. అలా చివరి బంతి వరకూ ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్​లో యూపీ విజయం సాధించి ప్లే ఆఫ్స్​ బెర్త్​ను ఖరారు చేసుకుంది. ప్రత్యర్థి జట్టు బౌలర్లలో కిమ్​ గార్త్​ 2, మౌనికా పటేల్​, అష్లెస్​ గార్డెనర్​, తనూజ కాన్వార్​, స్నేహా రాణా తలో వికెట్ తీశారు.

ఈ భారీ లక్ష్య ఛేదనలో యూపీ వారియర్స్​కు మంచి శుభారంభం దక్కలేదు. మోనికా పటేల్ వేసిన రెండో ఓవర్​లో రెండు ఫోర్లు కొట్టిన హేలీ(12).. అదే ఓవర్లో ఫిఫ్త్​ బాల్​కు భారీ షాట్ ఆడి హర్లీన్ డియోల్ చేతికి చిక్కింది. కిమ్ గార్త్ వేసిన మూడో ఓవర్​లో ఓ ఫోర్ బాదిన నవ్‌గిరె (4) అదే ఓవర్లో ఫోర్త్​ బాల్​కు పెవిలియన్​ చేరింది. ఇక ఐదో ఓవర్లో దేవికా వైద్య(7)ను తనూజా కన్వర్ పెవిలియన్​ పంపింది. అలా 39కే మూడు వికెట్లను కోల్పోయింది యూపీ.

ఆదుకున్న మెక్​ గ్రాత్​, గ్రేస్​ హ్యారిస్​..అయితే ఈ జట్టును తహ్లియా మెక్‌గ్రాత్, గ్రేస్​ హ్యారిస్​ అండగా నిలిచాడు. మొదట నుంచి ఈ ఇద్దరూ బౌండరీలు, సిక్సర్లతో గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించారు. అయితే ధాటిగా ఆడుతున్న వీరి జోరును ఆష్లే గార్డెనర్​ అడ్డుకుంది. ఆమె వేసిన 14వ ఓవర్​లో నాలుగో బంతికి భారీ షాట్​ ఆడిన మెక్‌గ్రాత్.. స్నేహ్ రాణా చేతికి చిక్కింది. వీరిద్దరు నాలుగో వికెట్​కు 53 బంతుల్లోనే 78 రన్స్ నమోదు చేశారు. మెక్‌గ్రాత్ తర్వాత క్రీజులోకి వచ్చిన దీప్తి శర్మ(6) నిరాశపరిచింది. అయితే ఆ తర్వాత వచ్చిన ఎకిల్‌స్టోన్ (13 బంతుల్లో 19*, 2x4) తో కలిసి హ్యారీస్​ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లింది. ఆ తర్వాత కిమ్ గార్త్ వేసిన 19వ ఓవర్​లో ఐదో బంతికి హ్యారీస్​ పెవిలియన్​ చేరింది.

చివర్లో ఉత్కంఠ.. ఇక లాస్ట్​ ఓవర్​లో ఏడు పరుగులు అవసరముండగా.. ఫస్ట్​ బాల్​కు ఎకిల్‌స్టోన్ రెండు పరుగులు చేసింది. సెకండ్​ బాల్​కు సింగిల్ వచ్చింది. మూడో బంతికి సిమ్రాన్ షేక్(1) సింగిల్ ఆడింది. నాలుగో బంతికి రెండో రన్ తీసే క్రమంలో సిమ్రాన్ రనౌట్​గా వెనుదిరిగింది. కానీ ఐదో బంతికి ఎకిల్‌స్టోన్.. బౌండరీ బాది.. యూపీని ప్లేఆఫ్స్​కు తీసుకెళ్లింది.

అంతకుముందు టాస్‌ గెలిచి ఫస్ట్​ బ్యాటింగ్​కు దిగిన గుజరాత్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 178 పరుగుల భారీ స్కోరు చేసింది. హేమలత(57; 33 బంతుల్లో 6x4, 3x6), ఆష్లీన్ గార్డ్‌నర్‌ (60; 39 బంతుల్లో 6x4, 3x6) హాఫ్ సెంచరీలతో మెరిశారు. సోఫీ డంక్లీ (23), లారా వోల్వార్డ్ట్ (17) పర్వాలేదనిపించగా.. హర్లీన్ డియోల్(4) రాణించలేకపోయింది. మొదట గుజరాత్‌కు మంచి శుభారంభం దక్కింది. ఓపెనర్లు డంక్లీ, లారా ఫస్ట్​ నుంచే దూకుడుగా ఆడారు. రాజేశ్వరి వేసిన రెండో ఓవర్‌లో డంక్లీ వరుసగా రెండు ఫోర్లు బాదితే.. లారా ఓ సిక్సర్ కొట్టింది. ఆ తర్వాత దీప్తి శర్మ వేసిన ఓవర్​లో లారా మరో సిక్స్‌ బాదింది. దీంతో నాలుగు ఓవర్లకు గుజరాత్ 41/0తో బలంగా కనిపించింది. అయితే, ఐదో ఓవర్‌లో ఫస్ట్ బాల్​కే లారాను.. అంజలి క్లీన్‌బౌల్డ్‌ చేసింది. అనంతరం డంక్లీ, హర్లీన్‌ డియోల్‌ను.. రాజేశ్వరి ఔట్ చేసింది. అయితే తర్వాత క్రీజులోకి వచ్చిన హేమలత, గార్డ్‌నర్‌ ఆచితూచి ఆడుతూ.. బౌండరీలతో స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లారు. అలా హాఫ్​ సెంచరీలతో జోరు మీదున్న వీరిద్దరిని.. పర్శవి చోప్రా వరుస ఓవర్లలో పెవిలియన్ పంపింది. ఎకిల్‌ స్టోన్‌ వేసిన చివరి ఓవర్లో అశ్వని కుమారి(5) నిరాశపరిచింది. యూపీ బౌలర్లలో రాజేశ్వరి గైక్వాడ్, పర్శవి చోప్రా తలో రెండు వికెట్లు తీయగా.. అంజలి శ్రావణి, ఎకిల్ స్టోన్‌ ఒక్కో వికెట్ పడగొట్టారు.

ఇదీ చూడండి:ఐపీఎల్ ముందు సునీల్ నరైన్ సంచలనం.. 7 ఓవర్లు.. 7 మెయిడెన్లు.. 7 వికెట్లు

Last Updated : Mar 20, 2023, 7:39 PM IST

ABOUT THE AUTHOR

...view details