తెలంగాణ

telangana

ETV Bharat / sports

అదరగొట్టిన గుజరాత్​.. ఆర్​సీబీకి మళ్లీ నిరాశే! - ఆర్సీబీ వర్సెస్​ గుజరాత్​ డబ్ల్యూపీఎల్​

మహిళల ప్రీమియర్​ లీగ్​లో భాగంగా జరిగిన ఆర్​సీబీ, గుజరాత్​ మధ్య జరిగిన మ్యాచ్​లో గుజరాత్​ క్యాపిటల్స్​ విజయం సాధించింది. బెంగళూరు జట్టుపై 11 పరుగుల తేడాతో గెలుపొందింది.

Gujarat Giants won the match
Gujarat Giants won the match

By

Published : Mar 8, 2023, 10:58 PM IST

Updated : Mar 9, 2023, 10:04 AM IST

మహిళల ప్రీమియర్​ లీగ్​లో భాగంగా ఆర్​సీబీ, గుజరాత్​ మధ్య జరిగిన మ్యాచ్​లో గుజరాత్​ జెయింట్స్​​ విజయం సాధించింది. బెంగళూరు జట్టుపై 11 పరుగుల తేడాతో గెలుపొందింది. గుజరాత్​ నిర్దేశించిన 201 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక ఆర్సీబీ చతికలపడింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసి ఓటమిపాలైంది. సోఫీ డివైన్ (66) రాణించినా ఫలితం లేకపోయింది. ఇక ఓపెనర్​ స్మృతి మంధాన (18) పేలవ ప్రదర్శన చేసింది. హీథర్‌ నైట్‌ (29), హెల్సే పెర్రే (32) ఫర్వాలేదనిపించారు. ఇక, గుజరాత్​ బౌలర్లు గార్డనర్​ 3 తీసి అదరగొట్టగా.. అన్నాబెల్(2)​, మాన్సీ జోషి (1)వికెట్​ పడగొట్టారు.

భారీ లక్ష్య ఛేదన కోసం ఆర్సీబీ టీమ్​ మొదట వేగాన్ని పుంజుకుంది. ఓపెనర్లు స్మృతి మంధాన (18), సోఫీలు బౌండరీల వేటలో సాగారు. సదర్‌లాండ్‌ వేసిన ఇన్నింగ్స్‌ అయిదో ఓవర్లో సోఫీ హ్యాట్రిక్‌ ఫోర్లు కొట్టడం వల్ల స్కోరు 50 దాటింది. అయితే ఆ తర్వాతి ఓవర్లోనే మంధాన ఔటవ్వడం వల్ల స్కోరు వేగం కూడా అమాంతం తగ్గింది. 11 ఓవర్లకు స్కోరు 88/1గా మిగిలింది. ఇక తదుపరి రంగంలోకి దిగిన ఎలీస్‌ పెర్రీ (32) కూడా పెవీలియన్​ బాట పట్టింది. అర్ధశతకం తర్వాత సోఫీ వేగం పెంచింది. కానీ వరుస ఓవర్లలో రిచా (10), సోఫీలు బయటకు వెళ్లిపోవడం వల్ల స్కోర్​ కూడా తగ్గింది. ఆర్సీబీ విజయానికి చివరి 4 ఓవర్లలో 67 పరుగులు అవసరం కాగా.. తొలి బంతికే సిక్సర్‌ కొట్టిన సోఫీ మరో షాట్‌కు వెనుదిరిగింది. కానీ హెదర్‌ నైట్‌ (30 నాటౌట్‌) మూడు ఫోర్లు కొట్టడం వల్ల ఆ ఓవర్లో మొత్తం 23 పరుగులు వచ్చాయి.

చివరకు 12 బంతుల్లో 33 పరుగులుగా సమీకరణం మారింది. కానీ 19వ ఓవర్‌ తొలి బంతికే కనిక స్టంప్​ అవుట్​ అయ్యింది. చివరి బంతికి హెదర్‌ బాల్​ను బౌండరీ దాటించడంతో ఆ ఓవర్లో 9 పరుగులే వచ్చాయి. దీంతో గెలుపు కోసం చివరి ఓవర్లో 24 పరుగులు కావాల్సి ఉండగా.. తొలి బంతికే పూనమ్‌ (2) వికెట్‌ కోల్పోయిన ఆర్సీబీ.. ఆ తర్వాత రెండు బంతుల్లో రెండు పరుగులే చేయడంతో ఓటమికి తల వంచింది. తన ఎడమ చేతికి గాయమైనప్పటికీ ఆటలో కొనసాగిన గుజరాత్‌ కెప్టెన్‌ స్నేహ్‌.. పట్టీ కట్టుకునే బౌలింగ్‌ చేసింది.

అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ తొలి ఓవర్లో ఒక్క పరుగు కూడా స్కోర్​ చేయలేకపోయింది. మెగాన్‌ షట్‌ (1/26) మెయిడిన్‌ వేసింది. ఆ తర్వాత వచ్చిన సోఫియా హర్లీన్​.. మైదానంలో ఇరగదీశారు. మూడో ఓవర్లోనే మేఘన (8) ఔటైనా.. సోఫియా బ్యాటింగ్​ పవర్​ ధాటికి ఆర్సీబీ బౌలర్లు ఇక చేతులెత్తేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆకాశమే హద్దుగా సిక్సర్లు, ఫోర్లతో ఆమె చెలరేగిపోయింది. ప్రీతి వేసిన అయిదో ఓవర్లో వరుసగా 4, 6, 4, 4, 4 స్కోర్​ సాధించింది. కేవలం 18 బంతుల్లోనే ఈమె అర్ధశతకాన్ని స్కోర్​ చేసింది. కాగా డబ్ల్యూపీఎల్‌లో అత్యంత వేగవంతమైన అర్ధశతకం ఇదే.

అయితే సోఫియా కూడా పెవీలియన్​ దారి పట్టడంతో ఊపిరి పీల్చుకుందామని అనుకున్న ఆర్సీబీకి ఆ అదృష్టం దక్కలేదు. ఆ తర్వాత మైదానంలోకి దిగిన హర్లీన్‌ బ్యాట్​తో విజృంభించింది. ఓ ఎండ్‌లో వికెట్లు పడుతున్నా.. మరో ఎండ్‌లో క్రమం తప్పకుండా బౌండరీలు సాధించి స్కోరు వేగం పడిపోకుండా టీమ్​ను ముందుకు నడిపింది. పెర్రీ వేసిన 17వ ఓవర్లోనే హ్యాట్రిక్‌ ఫోర్లు కొట్టింది. అలా అర్ధసెంచరీ మార్క్​కు చేరుకుంది. కానీ చివర్లో ఆర్సీబీ వేగం పుంజుకుంది. దీంతో ఆఖరి మూడు ఓవర్లలో 20 పరుగులు మాత్రమే గుజరాత్ స్కోర్​ చేయగలిగింది.​

Last Updated : Mar 9, 2023, 10:04 AM IST

ABOUT THE AUTHOR

...view details