తెలంగాణ

telangana

ETV Bharat / sports

WPL 2023: నోరిస్​ 'పాంచ్​' పటాకా.. బెంగళూరుపై దిల్లీ ఘన విజయం - మహిళల ప్రీమియర్​ లీగ్​ దిల్లీ క్యాపిటల్స్​

మహిళల ప్రీమియర్​ లీగ్​లో భాగంగా జరిగిన రెండో మ్యాచ్​లో దిల్లీ క్యాపిటల్స్​ విజయం సాధించింది. బెంగళూరు జట్టుపై 60 పరుగుల తేడాతో గెలుపొందింది.

wpl 2023 rcb vs delhi capitals won the match
wpl 2023 rcb vs delhi capitals won the match

By

Published : Mar 5, 2023, 6:49 PM IST

Updated : Mar 5, 2023, 6:59 PM IST

మహిళల ప్రీమియర్​ లీగ్​లో భాగంగా జరిగిన రెండో మ్యాచ్​లో దిల్లీ క్యాపిటల్స్​ విజయం సాధించింది. బెంగళూరు జట్టుపై 60 పరుగుల తేడాతో గెలుపొందింది. దిల్లీ నిర్దేశించిన 224 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక ఆర్సీబీ చతికలపడింది. 8 వికెట్ల నష్టానికి 20 ఓవరల్లో 163 పరుగులు చేసి ఓటమిపాలైంది. బ్యాటింగ్‌లో స్మృతి మంధాన (35), హీథర్‌ నైట్‌ (34), హెల్సే పెర్రే (31), మేఘన స్కౌట్‌ (30*) పోరాడినప్పటికీ లక్ష్యాన్ని అందుకోలేకపోయింది. దిల్లీ బౌలర్లలో తారా నోరీస్‌ 5 వికెట్లు పడగొట్టగా.. ఎలిస్‌ కాప్సే 2, శిఖా పాండే 1 వికెట్‌ చొప్పున తీశారు.

అంతకుముందు టాస్​ ఓడి బ్యాటింగ్​ చేసిన దిల్లీ భారీ స్కోర్​ సాధించింది. ఓపెనర్లు కెప్టెన్‌ మెగ్ లానింగ్‌ (72; 43 బంతుల్లో 14 ఫోర్లు), షఫాలీ వర్మ (84; 45 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ శతకాలతో దంచి కొట్టారు. షఫాలీ 31 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకోగా.. లానింగ్‌ 30 బంతుల్లోనే ఈ మార్క్‌ను అందుకుంది. ఆ తర్వాత మెరిజన్నే (39*; 17 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), జెమీమా రోడ్రిగ్స్‌ (22*; 15 బంతుల్లో 3 ఫోర్లు) కూడా రాణించడంతో దిల్లీ రికార్డు స్కోరు సాధించింది. బెంగళూరు బౌలర్లలో హీథర్‌ నైట్‌ రెండు వికెట్లు పడగొట్టింది. మిగతా బౌలర్లకు వికెట్లు దక్కలేదు.

నోరిస్​ అరుదైన ఘనత..
దిల్లీ క్యాపిటల్స్​ బౌలర్​ తారా నోరిస్​.. అరుదైన ఘనత సాధించింది. మహిళల ప్రీమియర్​ లీగ్​లో ఐదు వికెట్ల ప్రదర్శన ఇచ్చిన తొలి ప్లేయర్​గా రికార్డు సృష్టించింది. అంతుకుముందు దిల్లీ ఓపెనర్లు షఫాలీ, మెగ్​ లానింగ్​.. తొలి సెంచరీ భాగస్వామ్యం చేసిన ఓపెనర్లుగా రికార్డుకెక్కారు.

Last Updated : Mar 5, 2023, 6:59 PM IST

ABOUT THE AUTHOR

...view details