WPL 2023 : మహిళల ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుస ఓటములను చవిచూస్తోంది. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఆర్‌సీబీ గెలుపొందలేకపోయింది. ఇక, శుక్రవారం యూపీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో దారుణంగా ఓడింది. ఈ ఓటములన్నింటికి పూర్తి బాధ్యత తానే వహిస్తున్నట్లు ఆర్‌సీబీ కెప్టెన్ స్మృతి మంధాన తెలిపింది. మ్యాచ్ తర్వాత ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. దీంతో ఆమె ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
''గత నాలుగు మ్యాచ్‌లుగా ఇదే కొనసాగుతోంది. ఆడిన ప్రతీ మ్యాచ్‌లో మంచి ఆరంభం లభించినప్పటికీ.. ఆ తర్వాత నుంచి వికెట్లు కోల్పోతున్నాం. అదే మా మ్యాచ్‌లపై ప్రభావం చూపిస్తోంది. అంతే కాకుండా మా గేమ్ ప్లాన్ కూడా సరిగా లేనందున వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయాం. అందుకే ఈ ఓటములకు పూర్తి బాధ్యత నేనే తీసుకుంటున్నా. ఒక బ్యాటర్‌గా నేను పూర్తిగా ఫెయిలవుతున్నా. టాప్ ఆర్డర్ బ్యాటింగ్ మెరుగుపడాల్సి ఉంది. ఓటములతో గడిచిన వారం మాకు చాలా కష్టంగా అనిపించింది. ఇక నా ఫ్యామిలీ ఎప్పుడు నాకు సపోర్ట్‌గా ఉంటుంది. ఒంటరిగా కూర్చొని ఓటమికి గల కారణాలను వెతికి సరిచేసుకోవడమే''
--స్మృతి మంధాన, డబ్ల్యూపీఎల్ ఆర్సీబీ కెప్టెన్