తెలంగాణ

telangana

ETV Bharat / sports

WPL 2023కు రంగం సిద్ధం.. కియారా, కృతి డ్యాన్స్​.. మ్యాచ్​ల పూర్తి షెడ్యూల్ ఇదే!

మహిళల ప్రీమియర్​ లీగ్​.. మరో రోజులో ప్రారంభంకానుంది. ముంబయి ఇండియన్స్‌- గుజరాత్‌ జెయింట్స్‌ జట్ల మధ్య మ్యాచ్​తో ఈ మెగా ఈవెంట్‌కు తెరలేవనుంది. డబ్ల్యూపీఎల్‌ తొలి టైటిల్‌ కోసం ఐదు జట్లు పోటీపడనున్నాయి. ఈ నేపథ్యంలో డీవై పాటిల్‌ స్టేడియం, బ్రబౌర్న్‌ స్టేడియం వేదికగా జరగనున్న 22 మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌, మ్యాచ్‌ ఆరంభ సమయం, ఓపెనింగ్​ సెర్మనీ, లైవ్‌ స్ట్రీమింగ్‌ తదితర వివరాలు మీకోసం.

wpl 2023 opening ceremony guests and matches full schedule live streaming details
wpl 2023 opening ceremony guests and matches full schedule live streaming details

By

Published : Mar 3, 2023, 6:53 PM IST

బీసీసీఐ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన మహిళల ప్రీమియర్‌ లీగ్‌కు శనివారం(మార్చి 4) తొలి అడుగుపడనుంది. ముంబయి ఇండియన్స్‌- గుజరాత్‌ జెయింట్స్‌ జట్ల మధ్య పోటీతో ఈ మెగా ఈవెంట్‌కు తెరలేవనుంది. డబ్ల్యూపీఎల్‌ తొలి టైటిల్‌ కోసం మొత్తం ఐదు జట్లు పోటీపడనున్నాయి. ముంబయిలో జరుగనున్న ఈ టీ20 లీగ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, ముంబయి ఇండియన్స్‌, యూపీ వారియర్స్‌, గుజరాత్‌ జెయింట్స్‌, దిల్లీ క్యాపిటల్స్‌ ట్రోఫీ కోసం అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి.

కాగా, లీగ్‌ దశలో డబుల్‌ రౌండ్‌ రాబిన్‌ పద్ధతిలో ఐదు జట్లు పోటీపడతాయి. అగ్రస్థానంలో నిలిచిన మూడు జట్లు ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటాయి. పాయింట్ల పట్టికలో ప్రథమస్థానంలో నిలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. రెండు, మూడు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య ఎలిమినేటర్‌ మ్యాచ్‌తో మరో ఫైనలిస్టు ఖరారవుతుంది. ఈ నేపథ్యంలో డీవై పాటిల్‌ స్టేడియం, బ్రబౌర్న్‌ స్టేడియం వేదికగా జరగనున్న 22 మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌, మ్యాచ్‌ ఆరంభ సమయం, ఓపెనింగ్​ సెర్మనీ, లైవ్‌ స్ట్రీమింగ్‌ తదితర వివరాలు..

ఓపెనింగ్​ సెర్మనీ..
మహిళల ప్రీమియర్​ లీగ్​ ప్రారంభోత్సవంలో బాలీవుడ్​ బ్యూటీలు కియారా అడ్వాణీ, కృతి సనన్​ సందడి చేయనున్నారు. ప్రముఖ ర్యాపర్​ ఏపీ థిల్లాన్​తో కలిసి ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ ఇదివరకే ప్రకటించింది. ప్రముఖ గాయకుడు శంకర్​ మహదేవన్​.. డబ్ల్యూపీఎల్​ యాంథమ్​ను ఆలపించనున్నారు. బీసీసీఐ సెక్రటరీ జైషా, ప్రెసిడెంట్​ రోజర్​ బిన్నీ ఈ వేడుకలకు హాజరకానున్నారు. వారితో పాటు మహారాష్ట్ర రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారట. ఈ వేడుకలు శనివారం సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభం కానున్నాయి.

పూర్తి షెడ్యూల్‌..

  1. మార్చి 4- శనివారం- గుజరాత్‌ జెయింట్స్‌ వర్సెస్‌ ముంబయి ఇండియన్స్‌ వుమెన్‌- డాక్టర్‌ డీవై పాటిల్‌ స్పోర్ట్స్ అకాడమీ- రాత్రి 7.30 గంటలకు
  2. మార్చి 5- ఆదివారం- రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు వుమెన్‌ వర్సెస్‌ దిల్లీక్యాపిటల్స్‌ వుమెన్‌- బ్రబౌర్న్‌ స్టేడియం- మధ్యాహ్నం 3.30 గంటలకు..
  3. మార్చి 5- ఆదివారం- యూపీ వారియర్స్‌ వర్సెస్‌ గుజరాత్‌ జెయింట్స్‌- డాక్టర్‌ డీవై పాటిల్‌ స్పోర్ట్స్ అకాడమీ- రాత్రి 7.30 గంటలకు
  4. మార్చి 6- సోమవారం- ముంబయి ఇండియన్స్‌ వుమెన్‌ వర్సెస్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు వుమెన్‌ - బ్రబౌర్న్‌ స్టేడియం- రాత్రి 7.30 గంటలకు
  5. మార్చి 7- మంగళవారం- దిల్లీక్యాపిటల్స్‌ వుమెన్‌ వర్సెస్ యూపీ వారియర్స్‌- డాక్టర్‌ డీవై పాటిల్‌ స్పోర్ట్స్ అకాడమీ- రాత్రి 7.30 గంటలకు
  6. మార్చి 8- బుధవారం- గుజరాత్‌ జెయింట్స్‌ వర్సెస్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు వుమెన్‌- బ్రబౌర్న్‌ స్టేడియం- రాత్రి 7.30 గంటలకు
  7. మార్చి 9- గురువారం- దిల్లీక్యాపిటల్స్‌ వుమెన్‌ వర్సెస్ ముంబయి ఇండియన్స్‌ వుమెన్‌- డాక్టర్‌ డీవై పాటిల్‌ స్పోర్ట్స్ అకాడమీ- రాత్రి 7.30 గంటలకు
  8. మార్చి 10- శుక్రవారం- రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు వుమెన్‌ వర్సెస్‌ యూపీ వారియర్స్- బ్రబౌర్న్‌ స్టేడియం- రాత్రి 7.30 గంటలకు
  9. మార్చి 11- శనివారం- గుజరాత్‌ జెయింట్స్‌ వర్సెస్‌ దిల్లీక్యాపిటల్స్‌ వుమెన్‌- డాక్టర్‌ డీవై పాటిల్‌ స్పోర్ట్స్ అకాడమీ- రాత్రి 7.30 గంటలకు
  10. మార్చి 12- ఆదివారం- యూపీ వారియర్స్ వర్సెస్ ముంబయి ఇండియన్స్‌ వుమెన్‌ - బ్రబౌర్న్‌ స్టేడియం- రాత్రి 7.30 గంటలకు
  11. మార్చి 13- సోమవారం- దిల్లీక్యాపిటల్స్‌ వుమెన్ వర్సెస్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు వుమెన్‌ - డాక్టర్‌ డీవై పాటిల్‌ స్పోర్ట్స్ అకాడమీ- రాత్రి 7.30 గంటలకు
  12. మార్చి 14- మంగళవారం- ముంబయి ఇండియన్స్‌ వుమెన్‌ వర్సెస్‌ గుజరాత్‌ జెయింట్స్- బ్రబౌర్న్‌ స్టేడియం- రాత్రి 7.30 గంటలకు
  13. మార్చి 15- బుధవారం- యూపీ వారియర్స్ వర్సెస్ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు వుమెన్- డాక్టర్‌ డీవై పాటిల్‌ స్పోర్ట్స్ అకాడమీ- రాత్రి 7.30 గంటలకు
  14. మార్చి 16- గురువారం- దిల్లీక్యాపిటల్స్‌ వుమెన్ వర్సెస్ గుజరాత్‌ జెయింట్స్‌- బ్రబౌర్న్‌ స్టేడియం- రాత్రి 7.30 గంటలకు
  15. మార్చి 18- శనివారం- ముంబయి ఇండియన్స్‌ వుమెన్‌ వర్సెస్‌ యూపీ వారియర్స్‌- డాక్టర్‌ డీవై పాటిల్‌ స్పోర్ట్స్ అకాడమీ- మధ్యాహ్నం 3.30 గంటలకు
  16. మార్చి 18- శనివారం- రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు వుమెన్ వర్సెస్‌ గుజరాత్‌ జెయింట్స్‌- బ్రబౌర్న్‌ స్టేడియం- రాత్రి 7.30 గంటలకు
  17. మార్చి 20- సోమవారం- గుజరాత్‌ జెయింట్స్‌ వర్సెస్‌ యూపీ వారియర్స్‌- బ్రబౌర్న్‌ స్టేడియం- మధ్యాహ్నం 3.30 గంటలకు
  18. మార్చి 20- సోమవారం- ముంబయి ఇండియన్స్‌ వుమెన్‌ వర్సెస్ దిల్లీక్యాపిటల్స్‌ వుమెన్- డాక్టర్‌ డీవై పాటిల్‌ స్పోర్ట్స్ అకాడమీ- రాత్రి 7.30 గంటలకు
  19. మార్చి 21- మంగళవారం- రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు వుమెన్ వర్సెస్‌ ముంబయి ఇండియన్స్‌ వుమెన్‌- డాక్టర్‌ డీవై పాటిల్‌ స్పోర్ట్స్ అకాడమీ- మధ్యాహ్నం 3.30 గంటలకు
  20. మార్చి 21- మంగళవారం- యూపీ వారియర్స్‌ వర్సెస్‌ దిల్లీక్యాపిటల్స్‌ వుమెన్‌- బ్రబౌర్న్‌ స్టేడియం-రాత్రి 7.30 గంటలకు
  21. మార్చి 24- శుక్రవారం- ఎలిమినేటర్‌ మ్యాచ్‌- డాక్టర్‌ డీవై పాటిల్‌ స్పోర్ట్స్ అకాడమీ- రాత్రి 7.30 గంటలకు
  22. మార్చి 26- ఆదివారం- ఫైనల్‌ మ్యాచ్‌- బ్రబౌర్న్‌ స్టేడియం-రాత్రి 7.30 గంటలకు
  • లైవ్‌ స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..
  • టీవీ: స్పోర్ట్స్‌18 నెట్‌వర్క్‌
  • డిజిటల్‌ మీడియా: జియో సినిమా యాప్‌, వెబ్‌సైట్‌

5 జట్ల సభ్యులు వీరే!
1. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు
స్మృతి మంధాన (కెప్టెన్‌), రేణుకా సింగ్, ఎలిస్‌ పెర్రీ, సోఫీ డివైన్, రిచా ఘోష్, ఎరిన్ బర్న్స్, దీక్షా కసత్, ఇంద్రాణి రాయ్, శ్రేయాంక పాటిల్, కనికా అహుజా, ఆశా షిబానా, హీథర్ నైట్, డేన్ వాన్ నీకెర్క్, ప్రీతి బోస్, పూనమ్ ఖెనార్‌, మేగన్‌ షట్‌, సహానా పవార్

2. దిల్లీ క్యాపిటల్స్‌
మెగ్‌ లానింగ్‌(కెప్టెన్‌), జెమీమా రోడ్రిగ్స్‌(వైస్‌ కెప్టెన్‌), షఫాలీ వర్మ, రాధా యాదవ్‌, శిఖా పాండే, మరిజానే క్యాప్‌, టైటాస్‌ సాధు, అలిస్‌ కాప్సీ, తారా నోరిస్‌, లారా హ్యారిస్‌, జేసియా అక్తర్‌, మిన్ను మణి, తాన్యా భాటియా, పూనమ్‌ యాదవ్‌, జెస్‌ జొనాస్సెన్‌, స్నేహదీప్తి, అరుంధతి రెడ్డి, అపర్ణ మొండాల్‌.

3. యూపీ వారియర్స్‌
అలిసా హేలీ (కెప్టెన్‌), దీప్తి శర్మ (వైస్‌ కెప్టెన్‌), సోఫియా ఎక్లిస్టోన్, తహ్లియా మెక్‌గ్రాత్, షబ్నిమ్ ఇస్మాయిల్, అంజలి శర్వాణి, రాజేశ్వరి గైక్వాడ్, కిరణ్ నవ్‌గిరే, గ్రేస్ హారిస్, దేవికా వైద్య, లారెన్ బెల్, లక్ష్మీ యాదవ్, పార్షవితా చోప్రా, శ్వేతా సెహ్రావత్‌, ఎస్‌. యశశ్రీ, సిమ్రన్‌ షేక్‌.

4. గుజరాత్‌ జెయింట్స్‌
బెత్ మూనీ (కెప్టెన్‌), ఆష్లీ గార్డనర్, సోఫియా డంక్లీ, అన్నాబెల్లె సదర్లాండ్, హర్లీన్ డియోల్, డియాండ్రా డాటిన్, సబ్బినేని మేఘన, జార్జియా వేర్‌హామ్, మాన్సీ జోషి, డి. హేమలత, మోనికా పటేల్, తనూజా కన్వర్, స్నేహ రాణా (వైస్‌ కెప్టెన్‌), సుష్మా వర్మ, హర్లీ గాలా, అశ్వని కుమారి, పరునికా సిసోడియా, షబ్నం మహ్మద్‌.

5. ముంబయి ఇండియన్స్‌ జట్టు
హర్మన్‌ప్రీత్‌ కౌర్‌(కెప్టెన్‌), నాట్ సీవర్-బ్రంట్, అమేలియా కెర్, పూజా వస్త్రాకర్, యాస్తికా భాటియా, హీథర్ గ్రాహం, ఇసాబెల్లె వాంగ్, అమంజోత్ కౌర్, ధారా గుజ్జర్, సైకా ఇషాక్, హేలీ మాథ్యూస్, క్లో ట్రయాన్, హుమైరా కాజీ, ప్రియాంక బాలా, సోనమ్ యాదవ్, నీలం బిష్త్, జింటిమణి కలిత.

ABOUT THE AUTHOR

...view details