WPL 2023 : మహిళల ప్రీమియర్ లీగ్‌లో భాగంగా జరిగిన నాలుగో మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ ఘన విజయం సాధించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. ముంబయి వేదికగా జరిగిన ఈ డబ్ల్యూపీఎల్‌లో ముంబయి ఇండియన్స్ రెెండో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. 156 పరుగుల లక్ష్యంతో దిగిన ముంబయి జట్టుకు 5 ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేధించింది. ముంబయి ఇండియన్స్ బ్యాటర్లు హేలీ మాథ్యూస్(38 బంతుల్లో 77*), నాట్ స్కీవర్ బ్రంట్( 29 బంతుల్లో 55*) అర్థ శతకాలతో అద్భుతమైన ప్రదర్శన చేశారు. జట్టు గెలవడంలో వీరిద్దరూ కీలక పాత్ర పోషించారు. మరో ఓపెనర్ యాస్తికా భాటియా(23) 19 బంతుల్లో 4 ఫోర్లతో ఫర్వాలేదనిపించింది.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 18.4 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌటయ్యింది. ఓపెనర్లు స్మృతి మంధాన (23; 5×4) సోఫియే డివైన్ (16; 4×2) శుభారంభాన్ని అందించారు. ఆ తర్వాత స్వల్ప వ్యవధిలోనే 3 వికెట్లు కోల్పోవడం వల్ల స్కోర్‌బోర్డ్ నత్తనడకన సాగింది. చివర్లో రిచా ఘోష్ (28), ఆహుజా (22), శ్రేయంకా పాటిల్ (23), మేఘనా స్కౌట్ (20) రాణించడం వల్ల ఆర్సీబీ ఆ స్కోర్ సాధించింది. ముంబయి బౌలర్లలో హేలీ మ్యాథ్యూస్ 3 వికెట్లు పడగొట్టగా.. సాయిక్ ఇషాక్, అమేలియా కేర్ చెరో 2 వికెట్లు తీశారు. పూజా వస్త్రాకర్,బంట్ర్ తలో వికెట్ దక్కించుకున్నారు.