ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023లో ముంబయి ఇండియన్స్ శుభారంభం చేసింది. శనివారం రాత్రి ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరిగిన ఆరంభ మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్‌ను చిత్తుగా ఓడించింది. ముఖ్యంగా చెప్పాలంటే కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(65) ధనాధన్ ఇన్నింగ్స్‌తో బౌండరీల వర్షం కురిపించింది. 30 బంతులాడిన ఆమె ఏకంగా 14 ఫోర్లు బాది 65 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్ ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ జట్టు 5 వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసింది. దీంతో హర్మన్ 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్'గా నిలిచింది.
కాగా, ఈ మ్యాచ్‌లో క్రీజులోకి వచ్చినప్పటి నుంచి హర్మన్‌ప్రీత్ కౌర్ బౌండరీలతో విజృంభించింది. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ హర్మన్ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ హర్మన్.. ఓ దశలో తాను ఎదుర్కొన్న ఏడు బంతుల్ని వరుసగా ఫోర్లుగా మలిచింది. ఇన్నింగ్స్ 15వ ఓవర్లో మోనికా పటేల్ వేసిన బౌలింగ్‌లో చివరి నాలుగు బంతుల్ని వరుసగా 4,4,4,4 బాదింది. అదే ఓవర్లో ఓ బౌండరీ కూడా బాదడం వల్ల మొత్తం 21 రన్స్ వచ్చాయి. ఆ తర్వాత ఇన్నింగ్స్ 16వ ఓవర్ గార్డ్నర్ వేసిన బౌలింగ్‌లోనూ హర్మన్‌ప్రీత్ వరుసగా 4,4,4 ధనాధన్ బాదింది. ఈ క్రమంలోనే కేవలం 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకుని ఆకట్టుకుంది.