మహిళల ప్రీమియర్ లీగ్‌లో తన మొదటి మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ చేతిలో ఓటమిపాలైన గుజరాత్ జెయింట్స్ తన తీరు మార్చుకోలేదు. ఉత్కంఠభరింతంగా సాగిన మ్యాచ్‌లో యూపీ చేతిలో గుజరాత్ జట్టు 3 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ విజయంతో యూపీ జట్టు పాయింట్ల ఖాతాను తెరిచింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. 170 పరుగుల లక్ష్యాన్ని యూపీ 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
WPL 2023: దంచికొట్టిన కిరణ్, గ్రేస్.. యూపీ బోణీ.. గుజరాత్‌కు మళ్లీ నిరాశే
మహిళల ప్రీమియర్ లీగ్‌లో తన మొదటి మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ చేతిలో ఓటమిపాలైన గుజరాత్ జెయింట్స్‌కు మళ్లీ నిరాశే ఎదురైంది. ఉత్కంఠభరింతంగా సాగిన మ్యాచ్‌లో యూపీ వారియర్స్ చేతిలో 3 వికెట్ల తేడాతో మరో ఓటమిని మూటగట్టుకుంది.
కిరణ్ నవ్‌గిరే (53; 43 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ శతకం బాదగా.. చివర్లో గ్రేస్ హ్యారిస్ (59; 26 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. యూపీ విజయానికి ఆఖరి ఓవర్లో 19 పరుగులు అవసరం కాగా.. గ్రేస్ రెండు ఫోర్లు, రెండు సిక్స్‌లు బాది ఒక బంతి మిగిలుండగానే జట్టును విజయతీరాలకు చేర్చింది. ఎక్లెస్టోన్ (22; 12 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) ఆమెకు సహకారం అందించింది. అలీసా హీలే (7), శ్వేతా సెహ్రావత్ (5), తాహిలా మెక్‌గ్రాత్ (0), దీప్తి శర్మ (11), సిమ్రాన్ షేక్ (0), దేవికా వైద్య (4) విఫలమయ్యారు. గుజరాత్ బౌలర్లలో కిమ్ గార్త్ (5/16) ఆకట్టుకోగా.. మాన్సీ జోషి, అనాబెల్ ఒక వికెట్ పడగొట్టింది.
గుజరాత్ బ్యాటర్లలో హర్లీన్ డియోల్ (46; 32 బంతుల్లో 7 ఫోర్లు) రాణించగా.. సబ్బినేని మేఘన (24; 15 బంతుల్లో 5 ఫోర్లు), ఆష్లీన్ గార్డెనర్ (25; 19 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. యూపీ బౌలర్లలో దీప్తి శర్మ, సోఫీ ఎక్లెస్టోన్ తలో రెండు వికెట్లు పడగొట్టగా, తాహిలా మెక్‌గ్రాత్, అంజలి తలో వికెట్ తీశారు.