తెలంగాణ

telangana

ETV Bharat / sports

క్రికెట్ లవర్స్​కు BCCI 'విమెన్స్​ డే'​ ఆఫర్​.. ఆ మ్యాచ్​కు అందరికీ ఫ్రీ ఎంట్రీ - Mumbai Stadium Gujarat Giants vs RCB Match

క్రికెట్​ లవర్స్​కు బీసీసీఐ బంపర్​ ఆఫర్​ ప్రకటించింది. మార్చి 8న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా ప్రీమియర్​ లీగ్​లో బుధవారం జరగబోయే గుజరాత్​ జెయింట్స్​, రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు మ్యాచ్​కు అందరికి ఉచితంగా ప్రవేశం కల్పిస్తున్నట్లు తెలిపింది.

wpl 2023 tickets
డబ్ల్యూపీఎల్ 2023 ఉచిత ప్రవేశం

By

Published : Mar 7, 2023, 5:09 PM IST

క్రికెట్​ అభిమానులకు బీసీసీఐ శుభవార్త చెప్పింది. మార్చి 8న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని.. మహిళల ప్రీమియర్​ లీగ్​లో మ్యాచ్​ను అందరూ ఉచితంగా చూసే అవకాశాన్ని కల్పించింది. ముంబయి వేదికగా బుధవారం జరగబోయే గుజరాత్​ జెయింట్స్​,​ రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు మ్యాచ్​​ను వీక్షించేందుకు​ అందరికీ ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మ్యాచ్​ను చూసేందుకు అందరికీ ఉచితంగా టిక్కెట్లు జారీ చేయనున్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించిన టిక్కెట్లను ఇప్పటికే ఆన్​లైన్​లో ఉంచింది బీసీసీఐ.

అయితే బుధవారం జరగబోయే మ్యాచ్​కు మాత్రమే మహిళలతో పాటు పురుషులను కూడా టిక్కెట్టు లేకుండా మైదానంలోకి అనుమతిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ విషయాన్ని మార్చి 6న ఇదే స్టేడియంలో జరిగిన ముంబయి ఇండియన్స్​ వర్సెస్​ ఆర్సీబీ మ్యాచ్​లో ఎలక్ట్రానిక్​ బోర్డుపై తెలిపింది బీసీసీఐ. ఆ తర్వాత ఈ విషయాన్ని తమ అధికారిక ట్విట్టర్​ అకౌంట్​ ద్వారా కూడా వెల్లడించింది క్రికెట్​ బోర్డు. దేశంలో మహిళా క్రికెట్​ను ప్రోత్సహించేందుకు డబ్ల్యూపీఎల్​ (విమెన్స్ ప్రీమియర్ లీగ్) మ్యాచ్​లన్నింటినీ మహిళలతో పాటు బాలికలందరికి ఉచిత ప్రవేశం కల్పించింది భారత క్రికెట్​ బోర్డు.

ఇక మంగళవారం బెంగళూరుతో జరిగిన మ్యాచ్​లో 9 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది ముంబయి ఇండియన్స్​. దీంతో రెండో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది ముంబయి. ఆర్సీబీ నిర్దేశించిన 156 పరుగుల లక్ష్యాన్ని 34 బంతులు మిగిలి ఉండగాన్నే ఛేదించింది. అయితే ఇప్పటివరకు ముంబయి ఇండియన్స్ ఆడిన రెండు మ్యాచ్​లూ గెలవడం విశేషం. ఈ మ్యాచ్​లో ముంబయి ప్లేయర్​ హేలీ మాథ్యూస్ తన ఆట తీరుతో ఆకట్టుకుంది. ఇటు బౌలింగ్​తో పాటు అటు బ్యాటింగ్​లోనూ విజృంభించింది. 4 ఓవర్లో 28 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టిందీ​. ఇక బ్యాటింగ్​లో కూడా తనదైన దూకుడుని ప్రదర్శించింది. ఓపెనర్​గా దిగిన హేలీ(77 నాటౌట్​) 38 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్స్​తో విరుచుకుపడడం వల్ల టార్గెట్​ను ముంబయి 14.2 ఓవర్లలో ఒక వికెట్​ మాత్రమే కోల్పోయి అలవోకగా ఛేదించింది. ఇక మరో ప్లేయర్​ నాట్ సీవర్ బ్రంట్ కూడా 29 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్​తో 55 పరుగులు చేసి మెరిసింది. హేలీకి 'ప్లేయర్​ ఆఫ్​ ద మ్యాచ్​' అవార్డు లభించింది. మిగతా ముంబయి బౌలర్లు సైకా ఇషాక్​(2/26), అమెలియా కెర్​(2/30) కూడా విజృంభించడం వల్ల మొదట టాస్​ గెలిచి బ్యాటింగ్​ చేసిన బెంగళూరు 18.4 ఓవర్లలో 155 పరుగులకే ఆలౌటైంది.

ABOUT THE AUTHOR

...view details