Worldcup 2022 Ind Vs Wi Match: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియా ఘన విజయం సాధించింది. ప్రత్యర్థి జట్టుపై 155 పరుగుల తేడాతో గెలుపొందింది.
318 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ జట్టుకు ఓపెర్లు అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. వేగంగా ఆడుతూ 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే ఆ ఆర్వాత వికెట్ల పతనం మొదలైంది. కొత్తగా క్రీజులోకి వచ్చిన బ్యాటర్లు తడబడ్డారు. దీంతో 40.3ఓవర్లలో కేవలం 162 పరుగులకే ఆలౌట్ అయింది విండీస్. డియాంద్ర డాట్టిన్(62), హెలే మ్యాథ్యూస్(43) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడం వల్ల మిగతా బ్యాటర్లు చేతులెత్తేశారు. స్నేహ్ రానా 3, మేఘనా సింగ్ 2, రాజేశ్వరి గైక్వాడ్, పూజా వస్త్రాకర్, జులన్ గోస్వామి తలో వికెట్ దక్కించుకున్నారు.