తెలంగాణ

telangana

ETV Bharat / sports

అమ్మాయిలకు నిరాశ... వరల్డ్​కప్​లో మరో పరాజయం - india aus scorecard women

Worldcup 2022 Ind vs Aus: ఐసీసీ మహిళల ప్రపంచకప్​లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్​లో టీమ్​ఇండియా ఓటమి పాలైంది. మిథాలీ సేన నిర్దేశించిన 277 పరుగుల లక్ష్యాన్ని ఆసిస్ ఛేదించింది.

Worldcup 2022 Ind vs Aus
వరల్డ్​కప్​

By

Published : Mar 19, 2022, 2:29 PM IST

Updated : Mar 19, 2022, 3:48 PM IST

Worldcup 2022 Ind vs Aus: ఐసీసీ మహిళల ప్రపంచకప్​లో భారత్ మరో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆక్లాండ్, ఈడెన్ పార్క్​ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్​లో ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది.

టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన మిథాలీ సేన.. ఆదిలోనే తడబడింది. స్మృతి మంధాన(10), షఫాలీ వర్మ(12) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. ఆ తర్వాత బరిలోకి దిగిన యస్తికా భాటియా(59), మిథాలీ రాజ్​(68) ఇన్నింగ్స్​ను చక్కదిద్దారు. చివర్లో హర్మన్​ ప్రీత్​ కౌర్​(57), పూజా వస్త్రకార్ మెరుపులతో భారత్.. 277 పరుగుల లక్ష్యాన్ని ఆసిస్​ ముందుంచింది. ఆస్ట్రేలియా బౌలర్​ డార్సీ బ్రౌన్ మూడు వికెట్లు పడగొట్టింది. అలనా కింగ్​ రెండు వికెట్లు సాధించింది.

తర్వాత బ్యాటింగ్​కు దిగిన ఆసిస్ సేనకు ఓపెనర్లు రాచెల్ హేనెస్(43), అలిస్సా హీలీ(72) శుభారంభాన్ని ఇచ్చారు. మెగ్ లానింగ్(97), ఎల్లీస్ పెర్రీ(28), బేత్ మూనీ(30) సైతం రాణించగా.. ఆసిస్ లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది. భారత బౌలర్లలో పూజా వస్త్రకార్ రెండు వికెట్లు తీయగా.. స్నేహ్ రానా, మేఘనా సింగ్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

మిథాలీ కొత్త రికార్డు..

భారత మహిళ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ రికార్డు సృష్టించింది. ఈ మ్యాచ్‌లో మిథాలీ తన ప్రపంచకప్​ కెరీర్​లో 12వ అర్ధ సెంచరీని నమోదు చేసింది. మహిళల ప్రపంచకప్‌ చరిత్రలో 12 అర్ధ సెంచరీలు చేసిన న్యూజిలాండ్ మాజీ ప్లేయర్ డెబ్బీ హాక్లీ రికార్డును సమం చేసింది మిథాలీ.

జులన్​ 200 వన్డేలు..

టీమ్​ఇండియా పేసర్ జులన్ గోస్వామి మరో మైలురాయిని దాటింది. 200 వన్డేలు ఆడిన రెండో క్రీడాకారిణిగా రికార్డ్ సృష్టించింది. తాజాగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డేతో జులన్ ఈ ఫీట్​ను సాధించింది. టీమ్ఇండియా పేసర్ మిథాలీ రాజ్​(230) వన్డేలతో మొదటి స్థానంలో ఉంది. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ షార్లెట్ ఎడ్వర్డ్స్ 191 వన్డేలతో మూడో స్థానంలో ఉంది.

ఇదీ చదవండి: భారతీయ యువతితో మ్యాక్స్​వెల్ పెళ్లి.. శుభాకాంక్షలు తెలిపిన ఆర్సీబీ

Last Updated : Mar 19, 2022, 3:48 PM IST

ABOUT THE AUTHOR

...view details