ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో ఓడిపోయిన పాకిస్థాన్‌కు దెబ్బ మీద దెబ్బ తగిలింది. ఈ ఓటమి.. వరల్డ్‌టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2021-23 ఫైనల్ చేరాలని ఉవ్విళ్లూరుతున్న బాబర్ ఆజం టీమ్‌కు అవకాశాలను సంక్లిష్టం చేసింది. అలానే ఇది భారత్‌కు కూడా మేలు చేసింది. టెస్టు ఛాంపియన్‌షిఫ్ ఫైనల్ చేరే అవకాశాలు భారత్‌కు మరింత మెరుగయ్యాయి.
డబ్ల్యూటీసీ ప్రస్తుత సీజన్‌లో భాగంగా పాకిస్థాన్ ఈ సిరీస్ ఆరంభానికి ముందు పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. ఇంగ్లాండ్‌తో భారీ పరాజయం తర్వాత కూడా పాక్ అదే స్థానంలో ఉన్నప్పటికీ ఆస్ట్రేలియా, టీమ్‌ఇండియా విజయశాతాలతో పోలిస్తే మరింత వెనుకబడింది. దీంతో ఫైనల్ చేరాలంటే మిగిలిన మ్యాచ్‌లలో తప్పక గెలవడం సహా ఇతర జట్ల తాజా సిరీస్‌ల ఫలితాలపై ఆధారపడాల్సి వచ్చింది. కాగా, బంగ్లాదేశ్‌తో జరగబోయే టెస్టు సిరీస్‌ను టీమ్‌ఇండియా 2-0తో గెల్చుకుని.. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో ఒకటి కంటే ఎక్కువ మ్యాచ్‌లు ఓడిపోకపోతే.. భారత్ టాప్ 2 ప్లేస్‌లో నిలిచే అవకాశం కూడా ఉంది.