తెలంగాణ

telangana

ETV Bharat / sports

WTC FINAL: ఒక్కో టిక్కెట్టు ధర లక్షల రూపాయల్లో! - క్రికెట్ న్యూస్

టెస్టు ఛాంపియన్​షిప్ తుదిపోరుకు ప్రేక్షకులను అనుమతిస్తున్న నేపథ్యంలో టిక్కెట్లు దక్కించుకోవడంపై అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ఒక్కో టిక్కెట్టు ధర రూ.2 లక్షలుగా పైగా పలుకుతోంది.

World Test Championship: Final
కోహ్లీ విలియమ్సన్

By

Published : May 28, 2021, 11:28 AM IST

ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్(World Test Championship) ఫైనల్​పై రోజురోజుకు అభిమానుల్లో క్రేజ్ పెరుగుతోంది. జూన్ 18న సౌతాంప్టన్​ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్​ కోసం ఆటగాళ్లే కాకుండా అభిమానులు సిద్ధమవుతున్నారు. అయితే మ్యాచ్​ టిక్కెట్టు రేటు రూ.2 లక్షలకు పైగా ధర పలుకుతున్నట్లు తెలుస్తోంది.

ఇంగ్లాండ్​ గడ్డపై జరిగే ఈ మ్యాచ్​కు 4000 మంది ప్రేక్షకులను అనుమతించనున్నారు. అందులో కొంతమందికి బ్యాలెట్​ విధానంలో టిక్కెట్లు జారీ చేశారు. మిగిలిన వాళ్లకు టిక్కెట్ ఏజెన్సీల ద్వారా టిక్కెట్లను విక్రయించనున్నారు. ఈ క్రమంలో ఒక్కో దాని ధర రూ.2 లక్షలపైగా ఉందని ఓ ఏజెన్సీ నిర్వహకుడు చెప్పాడు.

టెస్టు ఛాంపియన్​షిప్ ఫైనల్ తర్వాత ఇంగ్లాండ్​తో ఐదు టెస్టుల సిరీస్​ ఆడనుంది టీమ్​ఇండియా. ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 14 మధ్య ఈ మ్యాచ్​లు జరగనున్నాయి.

క్రికెట్ మైదానం

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details