ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్(World Test Championship) అత్యధిక వికెట్ల వీరుడి నిలిచేందుకు.. టీమ్ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కొద్ది దూరంలో ఉన్నాడు. జూన్ 18న న్యూజిలాండ్‌తో జరిగే ఫైనల్లో నాలుగు వికెట్లు తీస్తే అగ్రస్థానానికి చేరుకుంటాడు.
ఈ టోర్నీలో ఇప్పటివరకు 13 మ్యాచ్‌ల్లో 67 వికెట్లు తీయగా, 14 మ్యాచ్‌లాడిన ఆసీస్ పేసర్ కమిన్స్ 70 వికెట్లతో టాప్‌లో కొనసాగుతున్నాడు.
అయితే టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్‌కు వేదికైన సౌతాంప్టన్ పిచ్, ప్రస్తుత వాతావరణం దృష్ట్యా పేసర్లకు అనుకూలించే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. మరోవైపు అశ్విన్‌కు తుది జట్టులో చోటు లభిస్తుందా అనేది కూడా చూడాలి.
ఈ మ్యాచ్ కోసం త్వరలో ఇంగ్లాండ్ వెళ్లనున్న టీమ్ఇండియా.. దీని తర్వాత ఇంగ్లీష్ జట్టుతో ఐదు టెస్టుల సిరీస్‌లో తలపడనుంది. ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 14 మధ్య ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి.
ఇది చదవండి:IPL2021: 8-9 రోజులు సరిగా నిద్రపోలేదు: అశ్విన్