తెలంగాణ

telangana

ETV Bharat / sports

World Cup Squad 2023 India : వరల్డ్​కప్​నకు భారత జట్టు ప్రకటన.. తెలుగబ్బాయికి నో ఛాన్స్​ - వన్డే ప్రపంచ కప్​ 2023 తుది జట్టు

World Cup Squad 2023 India : 2023 ఏడాదికి గాను వన్డే ప్రపంచకప్‌కు ఆడనున్న భారత జట్టును అజిత్‌ అగార్కర్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ ప్రకటించింది. 15 మంది ప్లేయర్లతో కూడిన తుది జట్టును వెల్లడించింది. ఇంతకీ అందులో ఎవరున్నారంటే ?

world cup squad 2023
world cup squad 2023

By ETV Bharat Telugu Team

Published : Sep 5, 2023, 1:41 PM IST

Updated : Sep 5, 2023, 2:07 PM IST

World Cup Squad 2023 India : వన్డే ప్రపంచకప్‌నకు ఆడనున్న భారత జట్టును అజిత్‌ అగార్కర్‌ నేతృత్వంలోని భారత సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ ప్రకటించింది. మంగళవారం 15 మంది పేర్లను వెల్లడించింది. ఈ తుది స్క్వాడ్​​కు రోహిత్ శర్మ కెప్టెన్​గా వ్యవహరించనుండగా.. ఆల్​రౌండర్​ హార్దిక్​ పాండ్య వైస్​ కెప్టెన్​గా బాధ్యతలు చేపట్టాడు. ఇక గాయాల నుంచి కోలుకుని ఆసియా కప్‌తో పునరాగమనం చేసిన శ్రేయస్ అయ్యర్, కేఎల్‌ రాహుల్‌కు ఈ జట్టులో అవకాశం దక్కగా.. సీనియర్ స్టార్ పేసర్ బుమ్రా పేస్ దళాన్ని ముందుండి నడిపించనున్నాడు.

World Cup Team India Squad : వన్డేల్లో పెద్దగా రాణించనప్పటికీ.. ఈ జట్టులోకి సూర్యకుమార్‌ యాదవ్‌ తీసుకునేందుకు సెలక్టర్లు మొగ్గుచూపారు. మరోవైపు శార్దూల్ ఠాకూర్, హార్దిక్‌ పాండ్యను పేస్‌ ఆల్‌రౌండర్లుగా.. అక్షర్ పటేల్‌, రవీంద్ర జడేజాకు స్పిన్‌ ఆల్‌రౌండర్లుగా అవకాశం కల్పించారు. అయితే యుజ్వేంద్ర చాహల్‌కు మరోసారి నిరాశే మిగలగా.. కుల్దీప్ యాదవ్‌ను స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌గా తీసుకున్నారు. హైదరాబాదీ కుర్రాడు తిలక్ వర్మ, ప్రసిధ్ కృష్ణతోపాటు వికెట్ కీపర్‌ సంజు శాంసన్‌కు ఈ తుది జట్టులో అవకాశం దక్కలేదు.

ఇటీవలే జరిగిన విండీస్‌ పర్యటనలో యంగ్​ ప్లేయర్​ తిలక్ వర్మ తన అద్భుత ప్రదర్శనతో అందరిని అబ్బురపరిచాడు. అలా ఆసియా కప్‌ తుది జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఈ క్రమంలో ఇక ప్రపంచ కప్​ టీమ్​లోనూ అతనికి ఛాన్స్​ వస్తుందని అందరూ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే సెలెక్షన్ కమిటీ మాత్రం ఈ సారి ప్రదర్శన కన్నా.. అనుభవానికి ఓటేసినట్లు అర్థమవుతోంది. దీంతో తిలక్‌ను కాదని సూర్యకుమార్‌, రాహుల్‌, శ్రేయస్‌కు జట్టులో స్థానాన్ని కల్పించారు.

మరోవైపు ప్రసిధ్ కృష్ణ అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. అందులోనూ భారత్‌లో మ్యాచ్‌లు జరగనుండటం వల్ల అదనపు పేసర్ అవసరం లేదని టీమ్‌ఇండియా సెలెక్షన్ కమిటీ భావించినట్లు సమాచారం. ఇక బుమ్రా, షమీ, సిరాజ్‌ రూపంలో స్పెషలిస్ట్‌ పేసర్లు జట్టులో ఉన్న విషయం తెలిసిందే. సంజూ శాంసన్‌కు అవకాశాలు ఇచ్చినప్పటికీ.. అతను అంచనాల మేరకు రాణించలేకపోయాడు. అయితే వచ్చిన అవకాశాలను ఇషాన్ కిషన్‌ బాగా సద్వినియోగం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇషాన్​ జట్టులోకి ఎంట్రీ ఇవ్వగా.. సంజూ చోటు దక్కించుకోలేకపోయాడు.

టీమ్ఇండియా తుది జట్టు :
Team India World Cup Squad : రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, అక్షర్ పటేల్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్.

Last Updated : Sep 5, 2023, 2:07 PM IST

ABOUT THE AUTHOR

...view details