తెలంగాణ

telangana

ETV Bharat / sports

కోలుకున్న స్మృతి మంధాన.. ప్రపంచకప్​లో ఆడేందుకు రెడీ! - icc womens world cup2022

Smrithi Mandana injury: దక్షిణాఫ్రికాతో జరిగిన వార్మప్​ మ్యాచ్​లో గాయపడిన స్మృతి మంధాన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు తెలిసింది. ఆమె ప్రపంచకప్​కు అందుబాటులో ఉంటుందని క్రికెట్​ వర్గాలు తెలిపాయి.

smruthi mandana injury
స్మృతి మంధానకు గాయం

By

Published : Feb 28, 2022, 1:31 PM IST

Updated : Feb 28, 2022, 2:02 PM IST

Smrithi Mandana injury: ప్రపంచకప్​లో భాగంగా జరిగిన ఓ వార్మప్​ మ్యాచ్​లో గాయపడిన భారత స్టార్​ బ్యాటర్​ స్మృతి మంధాన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని తెలిసింది. దీంతో ఆమె అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఆమె మళ్లీ ప్రాక్టీస్​ ప్రారంభించినట్లు సమాచారం. ప్రపంచకప్​కు అందుబాటులోనే ఉంటుందని క్రికెట్​ వర్గాలు తెలిపాయి.

కాగా, దక్షిణాఫ్రికాతో జరిగిన వార్మప్​ మ్యాచ్​లో స్మృతి తలకు గాయమైంది. భారత ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లో దక్షిణాఫ్రికా బౌలర్‌ ఇస్మాయిల్ బౌన్సర్‌ వేసింది. బౌన్సర్‌ బంతిని పుల్‌ షాట్‌ ఆడటానికి మంధాన ప్రయత్నించగా.. అది మిస్‌ అయ్యి మంధాన హెల్మెట్‌కు బలంగా తగిలింది. అమెకు వెంటనే ప్రాథమిక చికిత్స అందించారు. అయితే తలకు గాయం అవ్వడం వల్ల ఆమె ప్రపంచకప్​కు దూరం అవుతుందేమోనని ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలోనే ఆమె పరిస్థితి బాగానే ఉన్నట్లు తాజా సమాచారం బయటకు వచ్చింది.

మహిళల వన్డే ప్రపంచకప్ మార్చి 4వ తేదీ నుంచి జరగనుంది. న్యూజిలాండ్​ వేదికగా ఈ మెగాటోర్నీని నిర్వహించనున్నారు.

ఇదీ చదవండి:'జట్టులో స్థానం గురించి అసలు ఆలోచించను!'

Last Updated : Feb 28, 2022, 2:02 PM IST

ABOUT THE AUTHOR

...view details