తెలంగాణ

telangana

ETV Bharat / sports

World Cup Sensation Winners : మెగాటోర్నీలో సంచలన విజయాలు.. మేటిజట్లకు షాకిచ్చిన పసికూనలు! - afghanistan win world cup

World Cup Sensation Winners : క్రికెట్​లో బండ్లు ఓడలౌతాయి.. ఓడలు బండ్లవుతాయి అనడానికి ప్రపంచకప్​లోని తాజా అఫ్గానిస్థాన్ - ఇంగ్లాండ్​ మ్యాచే నిదర్శనం. ఈ మ్యాచ్​లో అఫ్గానిస్థాన్​ 69 పరుగుల తేడాతో నెగ్గింది. అయితే వరల్డ్​కప్​లలో ఇలాంటి సంచలన విజయాలు నమోదు కావడం ఇదేం తొలిసారి కాదు. గతంలో ఇలా చాలానే జరిగాయి. మరి ఆ సందర్భాలపై ఓ లుక్కేద్దామా

World Cup Sensation Winners
World Cup Sensation Winners

By ETV Bharat Telugu Team

Published : Oct 16, 2023, 3:53 PM IST

World Cup Sensation Winners :2023 ప్రపంచకప్​లోఅక్టోబర్ 15 ఆదివారం జరిగిన మ్యాచ్​లో అఫ్గానిస్థాన్.. డిఫెండింగ్ ఛాంప్ ఇంగ్లాండ్​కు షాకిచ్చింది. పసికూన అఫ్గాన్.. ఇంగ్లాండ్​ను 69 పరుగుల తేడాతో ఓడించి ఔరా అనిపించింది. అయితే క్రికెట్​లో కొన్నిసార్లు.. అసాధ్యం అనకున్నవి సుసాధ్యం అవుతాయి. అందుకు తాజాగా జరిగిన ఇంగ్లాండ్ - అఫ్గానిస్థాన్మ్యాచే నిదర్శనం. ఈ మెగాటోర్నీలో ఇలా జరగడం ఇదేమీ తొలిసారి కాదు. గతంలో అనేక సార్లు ఆయా ఎడిషన్​ల వరల్డ్​కప్​లలో చిన్న చిన్న జట్లు.. మేటి జట్లపై నెగ్గాయి. అలా ఎవరెవరు ఎప్పుడు ఎవరిపై నెగ్గారో తెలుసుకుందాం.

  • 1983లో చిన్న జట్టుగా టోర్నీలో అడుగుపెట్టిన భారత్.. పలు సంచలన విజయాలు నమోదుచేసింది. అప్పటికే రెండుసార్లు ఛాంపియన్​గా నిలిచిన వెస్టిండీస్​కు షాకిచ్చింది భారత్. ఆ ఎడిషన్​లో గ్రూప్​ స్టేజ్​లో భారత్.. విండీస్​తో రెండుసార్లు తలపడింది. దీంట్లో తొలి మ్యాచ్​లో భారత్​.. 34 పరుగుల తేడాతో గెలుపొందింది.
  • ఇక అదే ఎడిషన్​ మొదటి సెమీస్​లో బలమైన ఇంగ్లాండ్​ను ఢీకొన్న భారత్​.. 6 వికెట్లతో ప్రత్యర్థిని చిత్తు చేసి ఫైనల్స్​కు దూసుకెళ్లింది. ఇక ఫైనల్స్​లో మళ్లీ విండీస్​తో తలపడ్డ భారత్.. 43 పరుగుల తేడాతో గెలిచి ఛాంపియన్​గా అవతరించింది.
  • అదే ప్రపంచకప్​లో మరో సంచలన విజయం నమోదైంది. క్రికెట్​లో అప్పుడప్పుడే ఓనమాలు దిద్దుతున్న జింబాబ్వే.. బలమైన ఆస్ట్రేలియాను ఓడించి ఆశ్చర్యానికి గురిచేసింది.
  • 1992 వరల్డ్​కప్​లో జింబాబ్వే మళ్లీ సంచలనం సృష్టించింది. ఈసారి ఇంగ్లాండ్​పై నెగ్గింది.
  • 1996 ప్రపంచకప్​లో ఊహించని విజయం నమోదుచేసింది కెన్యా. ఈ పసికూన.. అప్పటికే రెండుసార్లు విశ్వవిజేతగా నిలిచిన విండీస్​ జట్టును చిత్తుచేసింది. ఇక ప్రపంచకప్‌ చరిత్రలో టెస్టు హోదా ఉన్న జట్టును నాన్‌ టెస్టు టీమ్‌ ఓడించడం ఇదే తొలిసారి.
  • 1999 మెగాటోర్నీలో ఏకంగా రెండు జట్లు ఆశ్చర్యానికి గురిచేశాయి. అందులో జింబాబ్వే.. సౌతాఫ్రికా, టీమ్ఇండియాపై విజయాలు నమోదు చేయగా.. బంగ్లాదేశ్, పటిష్ఠమైన పాకిస్థాన్​ను ఓడించింది.
  • 2003 ఎడిషన్​లో హేమాహేమీలతో కూడిన శ్రీలంకను.. కెన్యా మట్టికరిపించింది.
  • 2007 ప్రపంచకప్​లో బంగ్లాదేశ్.. టీమ్ఇండియాకు షాకిచ్చింది. భారత్ నిర్దేశించిన 192 పరుగుల లక్ష్యాన్ని బంగ్లా.. మరో తొమ్మిది బంతులుండగానే ఛేదించింది.
  • 2011లో భారత్ వేదికగా జరిగిన వరల్డ్​కప్​లో పసికూన ఐర్లాండ్, బలమైన ఇంగ్లాండ్​పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 328 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించినప్పటికీ.. ఐర్లాండ్ ఎనిమిది వికెట్లు కోల్పోయి ఐదు బంతులు మిగిలుండగానే ఛేదించింది.
  • 2015లోనూ ఐర్లాండ్ సంచలన విజయం నమోదు చేసింది. ఈ ఎడిషన్​లో ఐర్లాండ్.. విండీస్​ను చిత్తుచేసింది. ఇక బంగ్లాదేశ్.. ఇంగ్లాండ్​పై నెగ్గింది.

ABOUT THE AUTHOR

...view details