తెలంగాణ

telangana

ETV Bharat / sports

వరుణుడు అడ్డుతగిలిన మూడు ఐసీసీ టోర్నీలివే - డబ్ల్యూటీసీ ఫైనల్

సౌథాంప్టన్ వేదికగా భారత్-కివీస్​ మధ్య జరుగుతోన్న ప్రతిష్ఠాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్​ మ్యాచ్​కు వర్షం తీవ్ర అంతరాయం కలిగిస్తోంది. ఐదు రోజులలో కనీసం సగం రోజులు కూడా మ్యాచ్​ పూర్తిగా జరగలేదు. ఈ నేపథ్యంలో గతంలోనూ ఇలా ముఖ్యమైన మ్యాచ్​లకు వరుణుడు అడ్డుపడిన దాఖలాలు ఉన్నాయి. అవేంటో ఓ సారి చూద్దాం.

wtv final, rain played spoilsport
డబ్ల్యూటీసీ ఫైనల్, వర్షం ధాటికి గురైన టోర్నీలు

By

Published : Jun 23, 2021, 5:31 AM IST

ప్రతిష్ఠాత్మక ప్రపంచ టెస్ట్​ ఛాంపియన్​షిప్​ ఫైనల్​కు వరుణుడు పదే పదే అడ్డంకిగా మారాడు. సుదీర్ఘ ఫార్మాట్​లో ప్రపంచకప్​గా భావిస్తున్న ఈ మ్యాచ్​లో రెండ్రోజులు పూర్తిగా వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోగా.. మరో రెండ్రోజులు పూర్తి కోటా ఓవర్లు పడలేదు. దీంతో క్రికెట్​ మాజీలతో పాటు అభిమానులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. ఇక మ్యాచ్​లో ఫలితం తేలాలంటే రిజర్వ్​ డే కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో గతంలోనూ ఇలా వర్షం ధాటికి ప్రభావితమైన మ్యాచ్​లున్నాయి. అవేంటో చూడండి మరి.

ఛాంపియన్స్​ ట్రోఫీ ఫైనల్​-2002(కొలంబో )

2002లో ఛాంపియన్స్​ ట్రోఫీ ఫైనల్​ కొలంబో వేదికగా జరిగింది. అయితే ఈ మ్యాచ్​కు వర్షం పదే పదే అడ్డు తగిలింది. ఈ తుది పోరుకు రిజర్వ్​ డే ఉన్నప్పటికీ మ్యాచ్​ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్​ను సెప్టెంబర్​ 29, 30 తేదీలలో రెండ్రోజులు నిర్వహించారు.

లంక రెండుసార్లు బ్యాటింగ్..

తొలుత బ్యాటింగ్​కు దిగిన లంక 5 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది. జయసూర్య, కుమార సంగక్కర.. అర్ధ సెంచరీలతో మెరిశారు. అనంతరం బ్యాటింగ్​కు దిగిన టీమ్ఇండియా 2 ఓవర్లకు 14 పరుగులు చేసింది. తర్వాత వరుణుడు అడ్డు పడడం వల్ల మ్యాచ్​ను రద్దు చేశారు. తర్వాత రోజున ఫైనల్​ను తిరిగి నిర్వహించారు. ఈసారి బ్యాటింగ్​కు దిగిన లంక 222 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్​కు దిగిన భారత్​ 8.4 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 38 పరుగులు చేసింది. మళ్లీ వర్షం రావడం వల్ల మ్యాచ్​ను నిలిపివేశారు. ఇరుజట్లను విజేతలుగా ప్రకటించి ప్రైజ్​మనీని సంయుక్తంగా పంచారు. ఇది కూడా ఛాంపియన్స్​ ట్రోఫీకి ప్రారంభ ఎడిషన్​ కావడం విశేషం.

ఇదీ చదవండి:పాక్​ బ్యాటింగ్​ కోచ్​ పదవికి యూనిస్​ గుడ్​ బై​

ఐసీసీ వన్డే ప్రపంచకప్​-2019(మాంచెస్టర్​)

ఇంగ్లాండ్​ వేదికగా జరిగిన 2019 ప్రపంచకప్​లోనూ భారత్​కు చేదు అనుభవమే ఎదురైంది. మాంచెస్టర్​ వేదికగా న్యూజిలాండ్​తో సెమీస్​ సందర్భంగా వర్షం అంతరాయం కలిగించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. రిజర్వ్​ డే ఉన్న ఈ మ్యాచ్​లో తర్వాతి రోజు కోహ్లీ సేన బరిలోకి దిగింది. లక్ష్య చేధనలో భారత్​ టాపార్డర్​ విఫలమైంది. రోహిత్​, రాహుల్, కోహ్లీ.. తలా ఒక్క పరుగు చేసి పెవిలియన్​ చేరారు. రిషభ్ 32, హర్దిక్​ 32 పరుగులతో పర్వాలేదనిపించారు. తప్పక గెలవాల్సిన మ్యాచ్​లో ధోనీ, జడేజా.. వీరోచితంగా పోరాడారు. అర్ధ సెంచరీలతో రాణించినప్పటికీ.. విజయానికి 18 పరుగుల దూరంలో నిలిచింది టీమ్ఇండియా. మహీకి ఇదే చివరి వన్డే కావడం గమనార్హం.

డబ్ల్యూటీసీ ఫైనల్​-2021(సౌథాంప్టన్)

ప్రస్తుతం జరుగుతోన్న డబ్ల్యూటీసీ మ్యాచ్​కు వర్షం పదే పదే అంతరాయం కలిగిస్తోంది. తొలి రోజు ఒక్క బంతి పడకుండానే పూర్తిగా వర్షార్పణమైంది. ఇక రెండో రోజు ఆట జరిగినప్పటికీ.. వెలుతురులేమీ కారణంగా కేవలం 64.4 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. మూడో రోజు ఆటలోనూ పూర్తి కోటా ఓవర్లు పడలేదు. 76.2 ఓవర్ల ఆట మాత్రమే సాగింది. ఇక నాలుగో రోజు కూడా మొదటి రోజు అనుభవమే ఎదురైంది. ఐదో రోజు ఆట గంట ఆలస్యంగా ప్రారంభమైంది. ఇక రిజర్వ్ డే ఉపయోగించుకున్నా ఈ మ్యాచ్​లో ఫలితం తేలేది కష్టమనే చెప్పాలి. ఈ తుది పోరు డ్రాగా ముగిస్తే టైటిల్​ను ఇరుజట్లు సంయుక్తంగా పంచుకోవాలి.

ఇదీ చదవండి:బుమ్రా బౌలింగ్​ సీక్రెట్​పై ఐసీసీ వీడియో

ABOUT THE AUTHOR

...view details