తెలంగాణ

telangana

ETV Bharat / sports

వరల్డ్ కప్​ సెమీస్​లో కివీస్​- భారత్​ను వెంటాడుతున్న భయం- ఈసారి ఏమవుతుందో? - వన్డే ప్రపంచకప్​ 2023 సెమీఫైనల్​ స్క్వాడ్​

World Cup 2023 Semi Finals : వరుస విజయాలతో దూసుకెళ్తున్న టీమ్ఇండియా ఇప్పుడు సెమీస్​కు చేరుకుంది. అయితే ఇప్పుడే అసలు ట్విస్ట్ మొదలైంది. సెమీస్​లో తమ ప్రత్యర్థలను ఎదుర్కొనే తరుణంలో భారత్​ను ఓ భయం వెంటాడుతోంది. అదేంటంటే..

World Cup 2023 Semi Finals
World Cup 2023 Semi Finals

By ETV Bharat Telugu Team

Published : Nov 10, 2023, 10:05 AM IST

World Cup 2023 Semi Finals :వన్డే ప్రపంచకప్‌లో వరుస విజయాలతో భారత జట్టు దుమ్మురేపుతుంది. ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచుల్లో తమ సత్తా చాటిన టీమ్​ఇండియా.. రానున్న మ్యాచుల్లోనూ ఇదే జోరును చూపిచేందుకు సిద్ధమౌతోంది. ఇన్ని మ్యాచుల్లో రోహిత్​ సేన ముందు ఏ జట్టు కూడా నిలవలేకపోయింది. హాట్ ఫేవరేట్లుగా బరిలోకి దిగిన అన్ని జట్లను టీమ్​ఇండియా చిత్తు చేసింది. ఈ క్రమంలో 16 పాయింట్లతో టీమ్ఇండియా అగ్రస్థానంలో నిలిచి.. సెమీస్​లోకి అడుగుపెట్టింది.

మరోవైపు భారత్ తన చివరి లీగ్ మ్యాచ్​ను నవంబర్ 12న ఆడనుంది. నెదర్లాండ్స్​తో జరిగే ఈ మ్యాచ్​లో టీమ్ఇండియా ఈజీగా గెలస్తుందన్న ధీమాతో ఉంది. ఈ క్రమంలో రానున్న సెమీస్ మ్యాచులో టీమ్​ఇండియా.. న్యూజిలాండ్​తో తలపడటం దాదాపు ఖరారైంది. కానీ ఇంగ్లాండ్​తో జరగనున్న మ్యాచ్​లో పాకిస్థాన్​ జట్టు విజయం సాధిస్తే.. అప్పుడు పాక్​తో టీమ్​ఇండియా తలపడుతుంది. లేదంటే న్యూజిలాండ్ తోనే టీమ్​ఇండియా సెమీస్ దాదాపు ఖాయమైనట్లే. అయితే న్యూజిలాండ్​తో టీమ్​ఇండియా సెమీస్​ అంటే కొంచం ప్రమాదం పొంచి ఉందనే చెప్పవచ్చు.

World Cup 2023 Newzealand Squad : 2019 వన్డే ప్రపంచకప్​లో న్యూజిలాండ్ చేతిలో టీమ్​ఇండియా ఓటమిపాలైంది. అయితే 2023లో తొలుత పేలవ ప్రదర్శన చూపించిన కివీస్​ జ్టటు... ఇప్పుడు వేగం పుంజుకుని దూసుకెళ్తోంది. కేన్ విలియమ్సన్ గాయం నుంచి కోలుకోవడం ఆ జట్టుకు అతి పెద్ద బలంగా మారింది. ఇక రచిన్ రవీంద్ర, డేవాన్ కాన్వే, డారిల్ మిచెల్, ట్రెంట్ బోల్ట్, మిచెల్ సాంట్నర్ వంటి ప్లేయర్లు ఆ జట్టుకు మంచి ఇన్నింగ్స్ అందిస్తున్నారు. దీంతో న్యూజిలాండ్​ జట్టు బలమైన టీమ్స్​లిస్ట్​లోకి చేరుకుంది. ఈ క్రమంలో ఇక సెమీస్​లో న్యూజిలాండ్​ను అంత తేలిగ్గా తీసుకోలేమని విశ్లేషకుల మాట.

లీగు మ్యాచుల్లో ఏదైనా తప్పిదం జరిగినా దానికి మరో ప్రత్యామ్నాయం ఉంది. కానీ నాకౌట్ మ్యాచుల విషయంలో అలా కాదు. ఓడిపోతే ఇక ఇంటి దారి పట్టడమే. దీంతో.. సెమీస్​లో టీమ్​ఇండియా జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుందని టీమ్ఇండియాకు మాజీలు హితువు పలుకుతున్నారు.

మరోవైపు 2015 వన్డే ప్రపంచకప్ నుంచి టీమ్​ఇండియాను సెమీస్ సమస్య వెంటాడుతోంది. అప్పటి టోర్నిలో ఆస్ట్రేలియా చేతిలో టీమ్​ఇండియా ఓడింది. ఇక 2019 వన్డే ప్రపంచకప్​లో న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది.

అలాగే టీ20లోనూ సెమీస్​ సమయంలోనూ టీమ్ఇండియా ఓటమిని చవి చూసింది. 2016 టీ20 ప్రపంచకప్​లో జరిగిన సెమీస్ పోరులో భారత్​ను వెస్టిండీస్ ఓడించింది. 2022 సెమీస్​లో ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఏకంగా 10 వికెట్ల తేడాతో ఓడింది. ఇప్పుడు ఇదే అంశం అభిమానులను ఆందోళన కలిగించేలా చేస్తోంది. వన్డే ప్రపంచకప్​ను భారత్ సొంతం చేసుకోవాలంటే రానున్న సెమీస్ సమస్య నుంచి గట్టెక్కాల్సి ఉంది. దీంతో ఫ్యాన్స్​ కూడా రానున్న మ్యాచ్​ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. టీమ్ఇండియా గెలుపొందాలని ఆకాంక్షిస్తున్నారు.

357స్కోర్​, 55కు ఆలౌట్​- ప్రపంచకప్​లో టీమ్​ఇండియా భారీ విజయాలివే!

విరాట్ టు వార్న‌ర్‌- ప్ర‌పంచ క‌ప్​లో టాప్ -5 బ్యాట‌ర్లు​ వీరే!

ABOUT THE AUTHOR

...view details