World Cup 2023 Semi Final Tickets: 2023 ప్రపంచకప్‌నకు సమయం దగ్గరపడుతోంది. మెగా టోర్నమెంట్‌కు మరో 20 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. అయితే టోర్నీలోని లీగ్ మ్యాచ్ టికెట్ల అమ్మకాన్ని ప్రారంభించిన ఐసీసీ.. మరికొన్ని గంటల్లో నాకౌట్ మ్యాచ్‌ల టికెట్లను అమ్మనుంది. ఈ క్రమంలో సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్ టికెట్లను కూడా శుక్రవారం (సెప్టెంబర్ 15) రాత్రి 8 గంటల నుంచి అధికారిక వెబ్సైట్ (https://tickets.cricketworldcup.com) లో అందుబాటులో ఉంచనున్నట్లు ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది.
సెమీ ఫైనల్ మ్యాచ్‌లు..
- సెమీ ఫైనల్-1, నవంబర్ 15 వాంఖడే స్టేడియం (ముంబయి)
- సెమీ ఫైనల్-2, నవంబర్ 16 ఈడెన్ గార్డెన్స్ (కోల్‌కతా)
ఫైనల్..
- నవంబర్-19, నరేంద్ర మోదీ స్టేడియం (అహ్మదాబాద్)
Golden Ticket World Cup 2023 :అయితే వరల్డ్ కప్‌లో బీసీసీఐ..'గోల్డెన్ టికెట్స్ ఫర్ ఇండియా ఐకాన్స్' అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా భారతరత్న సచిన్ తెందూల్కర్, బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్‌కు బీసీసీఐ సెక్రటరీ జై షా ఈ గోల్డెన్ టికెట్ అందజేశారు. అయితే ఈ గోల్డెన్ టికెట్ అందుకున్న వారు, ప్రపంచకప్‌లోని అన్ని మ్యాచ్‌లను స్టేడియంలో ప్రత్యక్షంగా.. వీఐపీ బాక్స్‌లో కూర్చొని వీక్షించవచ్చు. అంతేకాకుండా ఈ టికెట్‌పై.. వారికి వీఐపీ వసతులన్నింటినీ కల్పిస్తారు. ఈ క్రమంలో సచిన్, అమితాబ్‌కు ఈ టికెట్ అందింది. ఇక మున్ముందు ఈ గోల్డెన్ టికెట్లను దేశంలోని ఆయా రంగాలకు చెందిన పలువురు ప్రముఖులకు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
World Cup 2023 Inaugural Match :అక్టోబర్ 5 నుంచి ప్రారంభమయ్యే ప్రపంచకప్‌నకు భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ నిర్వహణకు బీసీసీఐ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ మెగా టోర్నీ డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్- న్యూజిలాండ్ మ్యాచ్‌తో ప్రారంభం కానుంది. ఈ పోరుకు అహ్మదాబాద్ నరేంద్రమోదీ స్టేడియం వేదిక కానుంది.
Team India Squad For World Cup 2023 :రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్, జన్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్.