World Cup 2023 Prize Money :2023 ప్రపంచకప్ అక్టోబర్ 5న ప్రారంభమై.. నవంబర్ 17న ముగియనుంది. ఈ ప్రతిష్ఠాత్మకమైన టోర్నీకి భారత్ ఆతిథ్యమివ్వనున్న విషయం తెలిసిందే. అయితే ఈ మెగాటోర్నీ విజేతతో పాటు రన్నరప్, ఇంకా ఆయా ప్రైజ్‌మనీ అవార్డును ఐసీసీ శుక్రవారం ప్రకటించింది.
- విజేత - 40 లక్షల డాలర్లు (సుమారు రూ. 32 కోట్లు)
- రన్నరప్ - 20 లక్షల డాలర్లు (సుమారు రూ. 16 కోట్లు)
- సెమీఫైనల్స్‌లో ఓడిన జట్టు - 8 లక్షల డాలర్లు (సుమారు రూ. 6.5 కోట్లు)
- గ్రూప్ స్టేజ్ తర్వాత నిష్క్రమించిన జట్టు - లక్ష డాలర్లు (సుమారు రూ. 82 లక్షలు)
- గ్రూప్ స్టేజ్‌లో నెగ్గిన ప్రతీ మ్యాచ్‌కు - 40000 డాలర్లు (సుమారు రూ. 32 లక్షలు).
13వ ఎడిషన్ ప్రపంచకప్ టోర్నమెంట్లో ఆయా విజేతలకు ఐసీసీ.. మొత్తం 10 మిలియన్ల డాలర్ల ( సుమారు రూ. 82 కోట్ల) ప్రైజ్‌మనీని ఐసీసీ అందించనుంది. అయితే 2025లో జరగనున్న మహిళల ప్రపంచకప్‌లో కూడా.. ఇదే విధంగా ప్రైజ్‌మనీని అందించనున్నట్లు ఐసీసీ తెలిపింది. ఇక ఈ వరల్డ్ కప్‌లో మొత్తం 10 వేదికల్లో 48 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ టోర్నీ ప్రారంభానికి ముందు.. అన్ని జట్లు రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడనున్నాయి.