World Cup 2023 Pakistan Semis Chance :పాకిస్థాన్ కచ్చితంగా సెమీ ఫైనల్స్‌కు వస్తుందని.. ప్రపంచకప్ ప్రారంభానికి ముందు చాలామంది క్రికెట్ విశ్లేషకులు అంచనా వేశారు. కానీ పాక్ ఆట తీరుతో ఆ అంచనాలు అన్నీ తలకిందులయ్యాయి. మొదటి రెండు మ్యాచ్‌ల్లో (నెదర్లాండ్స్, శ్రీలంకపై) మాత్రమే విజయం సాధించింది పాక్. ఆ తర్వాత జరిగిన నాలుగు మ్యాచుల్లో వరుసగా ఓటమి పాలైంది.
దీంతో సెమీస్ రేసులో పాకిస్థాన్ జట్టు చాలా వెనుకబడి పోయింది. అయితే సెమీస్ చేరేందుకు పాక్‌కు ఇంకా అవకాశాలు ఉన్నాయి. కానీ, అది ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడి ఉంది. మరి, పాక్ సెమీస్‌కు రావాలంటే సమీకరణాలు ఎలా ఉన్నాయో ఈ 10 పాయింట్లలో తెలుసుకుందాం.
- పాకిస్థాన్ మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో కచ్చితంగా భారీ తేడాతో గెలుపొందాలి. అప్పుడే ఆ జట్టుకు సెమీస్‌కి వెళ్లే అవకాశాలు సజీవంగా ఉంటాయి.
- బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్‌తో పాకిస్థాన్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇందులో న్యూజిలాండ్, ఇంగ్లాండ్ నుంచి పాక్‌కు గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది.
- న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఆరు మ్యాచ్‌లు ఆడి.. అందులో నాలుగు గెలిచి వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి.
- కివీస్, ఆసీస్ మిగిలిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోతేనే.. పాక్ సెమీస్‌కు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
- ఒక వేళ న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఒక్కో మ్యాచ్ గెలిచినా.. పాక్‌కు అవకాశం ఉంటుంది.
- అప్పుడు తన మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో పాకిస్థాన్ భారీ తేడాతో విజయం సాధించి.. ఆ జట్ల కంటే ఎక్కువ నెట్ రన్‌రేట్‌ను సొంతం చేసుకోవాలి.
- ఇప్పటి వరకు శ్రీలంక, అఫ్గానిస్థాన్ ఐదేసి మ్యాచ్‌లు ఆడి రెండింటిలో విజయం సాధించాయి.
- ఆ రెండు జట్లు మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో.. కనీసం రెండు మ్యాచ్‌ల్లో ఓడితే పాక్ సులభంగా సెమీస్‌కు చేరుతుంది.
- ఒకవేళ అఫ్గాన్, శ్రీలంక మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడింటిలో గెలిచినా.. పాక్‌కు సెమీస్‌కు వెళ్లే అవకాశాలు ఉంటాయి.
- అప్పుడు పాకిస్థాన్ జట్టు మూడు మ్యాచుల్లోనూ భారీ తేడాతో గెలిచి.. ఆ జట్ల కంటే ఎక్కువ నెట్ రన్‌రేట్ కలిగి ఉండాలి.