World Cup 2023 Opening Ceremony : మరికొన్ని గంటల్లో ప్రతిష్ఠాత్మక ప్రపంచకప్‌నకు తెరలేవనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. అయితే వరల్డ్ కప్ అంటేనే మనకు గ్రాండ్ ఓపెనింగ్ ఈవెంట్ గుర్తొస్తుంది. బాణాసంచా కాల్పులతో, సంగీత నృత్య కార్యక్రమాలు, సెలబ్రిటీల హంగామాతో స్టేడియమంతా సందడి సందడిగా ఉంటుంది. ఆయా జట్ల కెప్టెన్లు కూడా ఈ వేడుకకు హాజరై.. స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తారు. కెప్టెన్లు అందరూ వరుసలో నిలబడి వరల్డ్‌కప్ ట్రోఫీతో ఫొటో దిగుతారు. ప్రపంచ కప్ మ్యాచ్‌లన్నీ ఒక ఎత్తైతే.. ఈ ఓపెనింగ్ ఈవెంట్ మరో ఎత్తులా ఉంటుంది. .
అయితే ఈ ప్రపంచకప్ ఎడిషన్‌కు అలాంటివేమి ఉండవని తాజాగా బీసీసీఐ వర్గాలు తెలిపాయి. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ వేడుకను రద్దు చేసినట్లు సమాచారం. కానీ ఆనవాయితీ ప్రకారం ఎప్పటిలాగే కెప్టెన్ల ఫొటో సెషన్ మాత్రం జరిగింది. నరేంద్ర మోదీ స్టేడియంలో అన్నిజట్ల కెప్టెన్లు ట్రోఫీతో ఫొటోకు ఫోజులిచ్చారు. ఇక మిరిమిట్లుగొలిపే ఆ వేడుకలను చూడాలనుకున్న ఫ్యాన్స్‌కు ఈ సారి కొద్దిపాటి నిరాశే మిగిలింది.
మొత్తం పది జట్లు ప్రపంచకప్ టోర్నీలో పోటీ పడుతున్నాయి. ఈ మ్యాచ్‌లు పది వేదికల్లో జరగనున్నాయి. హైదరాబాద్, అహ్మదాబాద్, ధర్మశాల, దిల్లీ, చెన్నై, లఖ్‌నవూ, పుణె, బెంగళూరు, ముంబయి, కోల్‌కతాల్లో ఈ మెగాటోర్నీ జరగనుంది. వన్డే ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్, ఫైనల్ మ్యాచ్‌కు ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ మైదానమైన అహ్మదాబాద్ వేదిక కానుంది. కోల్‌కతా, ముంబయి ఒక్కో సెమీస్‌కు.. ఆతిథ్యం ఇస్తాయి. నవంబర్ 15న తొలి సెమీఫైనల్‌కు ముంబయి, 16న రెండో సెమీఫైనల్‌కు కోల్‌కతా ఆతిథ్యమివ్వనుండగా.. నవంబర్ 19న ఫైనల్ అహ్మదాబాద్‌లో నిర్వహించనున్నారు. ఈ మెగా టోర్నీలో మొత్తం 45 లీగ్ మ్యాచ్‌లు, 3 నాకౌట్ మ్యాచులు ఉంటాయి. ఈ మెగా టోర్నీ రౌండ్ రాబిన్ ఫార్మాట్లో జరుగుతుంది. ప్రతి జట్టు మిగిలిన అన్ని జట్లతో తలపడుతుంది. అంటే తొమ్మిది లీగ్ మ్యాచులు ఆడతాయి. పాయింట్ల పట్టికలో మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి.
Virat Kohli World Cup 2023 : నెట్టింట విరుష్క పోస్ట్.. ఆ విషయాన్ని అడిగి విసిగించవద్దంటూ స్పెషల్ రిక్వెస్ట్..
World Cup 2023 Team India : 'టీమ్ఇండియాకు అదే ప్లస్ పాయింట్.. ఆ ఒక్కటి ఉంటే సెమీస్‌కు ఖాయం'