తెలంగాణ

telangana

ETV Bharat / sports

లేజర్ లైట్ షో, బాలీవుడ్ సింగర్స్ పెర్ఫార్మెన్స్ - బీసీసీఐ ప్లాన్​ అదుర్స్​- షెడ్యూల్​ ఇదే - World Cup 2023 special trains

World Cup 2023 Final Events : 2023 ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అహ్మదాబాద్​లో జరగనున్న ఈ మ్యాచ్​లో.. నిర్వహించే వేడుకలను బీసీసీఐ అధికారికంగా తెలిపింది.

World Cup 2023 Final Events
World Cup 2023 Final Events

By ETV Bharat Telugu Team

Published : Nov 18, 2023, 10:49 AM IST

Updated : Nov 18, 2023, 12:15 PM IST

World Cup 2023 Final Events: 2023 వరల్డ్​కప్​ ఫైనల్​ మ్యాచ్​ను బీసీసీఐ గ్రాండ్​గా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ ముగింపు వేడుకలు అట్టహాసంగా జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వాయుసేన విన్యాసాలు, సెలబ్రిటీల పెర్ఫార్మెన్స్​లు ఉండనున్నట్లు ఇప్పటికే పలు కథనాలు వచ్చాయి. అయితే మునుపెన్నడూ లేని విధంగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఫైనల్​ మ్యాచ్​ జరగనున్నట్లు బీసీసీఐ అధికారికంగా తెలిపింది. ఎప్పుడెప్పుడు ఏయే కార్యక్రమాలు ఉంటాయో ట్విట్టర్ వేదికగా పేర్కొంది.

  • మ్యాచ్​కు ముందు.. మ్యాచ్ ప్రారంభానికి ముందు మధ్యాహ్నం 1.35 నుంచి 1.50 గంటల మధ్య వాయుసేన విన్యాసాలు జరగనున్నాయి. భారత వైమానిక దళానికి చెందిన సూర్య కిరణ్‌ ఏవియేషన్ బృందం.. ఈ షో నిర్వహించనుంది.
  • 1st డ్రింక్స్ బ్రేక్.. గుజరాత్​కు చెందిన ప్లేబ్యాక్ సింగర్ ఆదిత్య గాధ్వి.. పెర్ఫార్మెన్స్ ఉండనుంది. పలు గుజరాతీ సినిమాల్లో ఆదిత్య గాధ్వికి పనిచేసిన అనుభవం ఉంది. పలు భాషల్లోనూ ఆదిత్య పాటలు పాడాడు.
  • ఇన్నింగ్స్​ బ్రేక్.. తొలి ఇన్నింగ్స్ తర్వాత బ్రేక్ సమయంలో అద్భతమైన సాంస్కృతిక కార్యక్రమం ఉండనుంది. ఈ కార్యక్రమంలో పాపులర్ సింగర్స్​.. ప్రీతమ్ చక్రబొర్తీ, జొనితా గాంధీ, నకాశ్ అజీజ్, అమిత్ మిశ్రా, అక్సా సింగ్, తుషార్ జోషి ప్రదర్శన ఉండనుంది.
  • 2nd డ్రింక్స్ బ్రేక్.. రెండో ఇన్నింగ్స్​ విరామం సమయంలో లేజర్ లైట్ షో ఉండనున్నట్లు బీసీసీఐ తెలిపింది.

అహ్మదాబాద్​కు ప్రత్యేక రైళ్లు.. ఫైనల్ మ్యాచ్​ సందర్భంగా టీమ్ఇండియా ఫ్యాన్స్ ఇప్పటికే భారీ సంఖ్యలో అహ్మదాబాద్ చేరుకుంటున్నారు. అయితే ఈ మ్యాచ్​ క్రేజ్​ను దృష్టిలో ఉంచుకొని భారతీయ రైల్వే.. ముంబయి నుంచి అహ్మదాబాద్​కు మూడు ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు రైల్వే అధికారి జితేంద్ర కుమార్ తెలిపారు.

  • మొదటి ట్రైన్.. ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్ నుంచి అహ్మదాబాద్​కు నవంబర్ 18 రాత్రి 10.30 గంటలకు బయల్దేరుతుంది. 19 నవంబర్ ఉదయం 6.40 గంటలకు అహ్మదాబాద్ చేరుకుంటుంది.
  • రెండో ట్రైన్.. బాంద్రా టెర్మినస్ నుంచి నవంబర్ 18 రాత్రి 11.45 గంటలకు బయల్దేరి.. 19 నవంబర్ ఉదయం 7.20కు అహ్మదాబాద్ చేరుకుంటుంది.
  • మూడో ట్రైన్.. ముంబయి సెంట్రల్ - అహ్మదాబాద్.. నవంబర్ 18 రాత్రి బయల్దేరి.. 19 నవంబర్ ఉదయం 8.45 గంటలకు చేరనుంది.
Last Updated : Nov 18, 2023, 12:15 PM IST

ABOUT THE AUTHOR

...view details