World cup 2022 India vs England: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై గెలిచి ఊపుమీదున్న టీమ్ఇండియా.. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌పై విజయం సాధించి గత ప్రపంచకప్ ఫైనల్ పోరులో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని తహతహలాడుతోంది.
మరోవైపు ఇంగ్లాండ్ జట్టు వరుస వైఫల్యాలను ఎదుర్కొంటోంది. ఆడిన మూడు మ్యాచుల్లోనూ ఓటమిపాలై పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో కొనసాగుతోంది. ఇక భారత్ మూడు మ్యాచ్‌ల్లో రెండింట్లో విజయం సాధించి మూడో స్థానంలో కొనసాగుతోంది. గత మ్యాచ్‌లో స్మృతి మంధాన (123), హర్మన్‌ప్రీత్ కౌర్ (109) సెంచరీలతో చెలరేగడంతో భారత్ మరింత ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది.