Worldcup 2022 IND VS PAK: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో టీమ్ఇండియా బ్యాటర్లు ఆచితూచి ఆడారు. నిర్ణీత 50ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 244 పరుగులు చేశారు. పూజా వస్త్రాకర్(67), స్నేహ్ రానా(53*), స్మృతి మంధాన(52), దీప్తి శర్మ(40) బాగా రాణించారు. కాగా, పాక్ బౌలర్లలో నిదా దార్, నష్రా సంధు తలో రెండు, దియానా బాగ్, అనమ్ అమిన్, ఫాతిమా సానా తలో వికెట్ తీశారు.
ఆ తర్వాత కూడా స్వల్ప వ్యవథిలో నాలుగు వికెట్లు కోల్పోయి మిథాలీ సేన కష్టాల్లో పడింది. జట్టు స్కోర్ 96 పరుగుల వద్ద దీప్తి శర్మ (40) రెండో వికెట్‌గా వెనుదిరగ్గా మరో రెండు పరుగులకే ఓపెనర్ స్మృతి మంధాన (52) మూడో వికెట్‌గా పెవిలియన్ బాట పట్టింది. అయితే, మరో ఓపెనర్ స్మృతి మంధాన, వన్‌డౌన్ బ్యాటర్ దీప్తి శర్మ కీలక బ్యాటింగ్ చేశారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 92 పరుగుల భాగస్వామ్యం జోడించారు. ఆ తర్వాత కాసేపటికే హర్మన్‌ప్రీత్ కౌర్ (5), రీచా ఘోష్(1), కెప్టెన్ మిథాలీ రాజ్(9) సైతం వెనుదిరిగారు. దీంతో 18 పరుగుల స్వల్ప వ్యవధిలో ఐదు వికెట్లు తీసి భారత్‌ను ఒత్తిడిలోకి నెట్టారు. ఇక చివర్లో వచ్చిన స్నేహ్ రానా(53*), పూజా వస్త్రాకర్(67) స్కోరు బోర్డును పరుగులెత్తించారు.