World Cup 2022: మహిళల ప్రపంచకప్‌లో తప్పక గెలవాల్సిన మ్యాచ్లో భారత్ రెచ్చిపోయింది. బంగ్లాదేశ్తో జరిగిన పోరులో ఇండియా 110 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బ్యాటింగ్లో మోస్తరుగానే పరుగులు చేసినప్పటికీ.. బౌలింగ్లో సత్తా చాటింది. 119 పరుగులకే బంగ్లాను కట్టడి చేసింది.
టాస్‌నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్‌ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. దీంతో బంగ్లాకు 230 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. యస్తిక భాటియా (50) అర్ధశతకంతో రాణించింది. మిగతా బ్యాటర్లలో స్మృతి మంధాన 30, షఫాలీ వర్మ 42, హర్మన్ కౌర్ 14, రిచా ఘోష్ 26, స్నేహ్ రాణా 27, పూజా వస్త్రాకర్ 30*, జులన్ గోస్వామి 2* పరుగులు చేశారు. మిథాలీ రాజ్ సున్నాకే వెనుదిరిగింది. బంగ్లా బౌలర్లలో రితు మోని 3, నహిదా 2, జహనర అలమ్ ఒక వికెట్ తీశారు.