టీమ్ఇండియా(TeamIndia) జులైలో శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. రెగ్యులర్ కెప్టెన్ కోహ్లీ, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ లేకుండా యువ ఆటగాళ్లతో కూడిన పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్ జట్టు లంకతో మ్యాచ్‌లు ఆడనుంది. అయితే ఈ పర్యటనలో భారత జట్టు గెలిస్తే తానేమీ ఆశ్చర్యపోనని మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్(MSK Prasad) అన్నాడు. తమ కాలంతో పోలిస్తే ఈ టీమ్‌లో ఆత్మవిశ్వాసం రెట్టింపు స్థాయిలో ఉందని ఉందని ప్రశంసించాడు.
"సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav), ఇషాన్ కిషన్(IshanKishan), సంజూ శాంసన్(sanjusamson) వంటి అద్భుత యువ ఆటగాళ్లు ఈ పర్యటనలో ఉన్నారు. వారు తమకు దొరికిన ఈ గొప్ప అవకాశాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకుని తామెంటో నిరూపించుకుంటారు. అవేష్ ఖాన్(ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపిక) అతడు కూడా మంచి ప్రదర్శన చేస్తాడు. ఐపీఎల్లో అద్భుతంగా ఆడాడు. అతడిని ఈ సిరీస్‌లో చూడలేకపోవడం దురదృష్టకరం. అప్పట్లో మాకు ఉన్న నైపుణ్యాలు ఈ తరం క్రికెటర్లకు మెండుగా ఉన్నాయి. అయితే ఆత్మవిశ్వాసం మాత్రం మా కన్నా దాదాపు ఐదు రెట్లు ఎక్కువగా ఉంది"