Womens World Cup 2022: ఈ ఏడాది జరగాల్సిన మహిళల ప్రపంచ కప్ కరోనా కారణంగా వచ్చే ఏడాదాకి వాయిదా పడింది. తాజాగా దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను ప్రకటించింది ఐసీసీ. న్యూజిలాండ్‌లోని ఆరు ప్రధాన నగరాల వేదికగా మార్చి 4వ తేదీ నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు ఈ టోర్నీ జరగనుంది. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్-వెస్టిండీస్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇక భారత జట్టు దాయాది పాకిస్థాన్‌తో మార్చి 6న తమ మొదటి మ్యాచ్ ఆడనుంది.
పూర్తి షెడ్యూల్
మార్చి 4 - న్యూజిలాండ్-వెస్టిండీస్ (మౌంట్ మంగనూయ్)
మార్చి 5 - బంగ్లాదేశ్-సౌతాఫ్రికా (దునెడిన్)
మార్చి 5 - ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ (హామిల్టన్)
మార్చి 6 - భారత్-పాకిస్థాన్ (మౌంట్ మంగనూయ్)
మార్చి 7 - న్యూజిలాండ్-బంగ్లాదేశ్ (దునెడిన్)
మార్చి 8 - ఆస్ట్రేలియా-పాకిస్థాన్ (మౌంట్ మంగనూయ్)
మార్చి 9 - వెస్టిండీస్-ఇంగ్లాండ్ (దునెడిన్)
మార్చి 10 - భారత్-న్యూజిలాండ్ (హామిల్టన్)
మార్చి 11 - పాకిస్థాన్-సౌతాఫ్రికా (మౌంట్ మంగనూయ్)
మార్చి 12 - భారత్-వెస్టిండీస్ (హామిల్టన్)
మార్చి 13 - న్యూజిలాండ్-ఆస్ట్రేలియా (వెల్లింగ్టన్)
మార్చి 14 - పాకిస్థాన్-బంగ్లాదేశ్ (హామిల్టన్)
మార్చి 14 - సౌతాఫ్రికా-ఇంగ్లాండ్ (మౌంట్ మంగనూయ్)
మార్చి 15 - ఆస్ట్రేలియా-వెస్టిండీస్ (వెల్లింగ్టన్)