తెలంగాణ

telangana

ETV Bharat / sports

T20 Worldcup: టీమ్​ఇండియా ఖాతాలో రెండో విక్టరీ.. లేడీ ధోనీ సూపర్ ఇన్నింగ్స్​

టీ20 మహిళల ప్రపంచకప్‌లో భారత్‌ వరుసగా రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. తాజాగా జరిగిన మ్యాచ్​లో వెస్టిండీస్​పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.

IND VS Westindies
టీమ్​ఇండియా ఖాతాలో రెండో విక్టరీ.. లేడీ ధోనీ సూపర్ ఇన్నింగ్స్​

By

Published : Feb 15, 2023, 9:52 PM IST

Updated : Feb 15, 2023, 10:06 PM IST

మహిళల టి20 ప్రపంచకప్ 2023లో టీమ్​ఇండియాకు వరుసగా రెండో విజయం దక్కింది. తొలి మ్యాచ్​లో పాకిస్థాన్​పై విజయం సాధించిన భారత్ అమ్మాయిలు.. రెండో మ్యాచ్​లో వెస్టిండీస్​పై సునాయసంగా గెలిచారు. గ్రూప్ బిలో భాగంగా తాజాగా జరిగిన మ్యాచ్​లో భారత్ 6 వికెట్ల తేడాతో వెస్టిండీస్​పై ఘన విజయం సాధించింది. 119 పరుగుల లక్ష్యాన్ని భారత్ 18.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. లేడీ ధోనీ రిచా ఘోష్ (32 బంతుల్లో 44*; 5x4) మరోసారి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్​ను ఆడి ఆకట్టుకుంది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (42 బంతుల్లో 33; 3x4 ) రాణించింది. విండీస్ బౌలర్లలో రామ్ హరాక్ 2 వికెట్లు తీసింది.

కాగా, ఛేదనలో టీమ్​ఇండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. గాయం నుంచి కోలుకున్నాక ఆడిన స్మృతి మంధాన(10) నిరాశ పరిచింది. రెండో ఫోర్లు బాది స్టంపౌట్ అయ్యింది. అనంతరం తొలి మ్యాచ్​లో పాకిస్థాన్​పై అర్ధ సెంచరీతో అదరగొట్టిన జెమీమా రోడ్రిగ్స్(1) విఫలమైంది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన షెఫాలీ వర్మ (28) కూడా పెవిలియన్ చేరింది. దీంతో భారత్ కష్టాల్లో పడింది. ఈ దశలో జతకలిసిన హర్మన్ ప్రీత్ కౌర్, రిచా ఘోష్​ను మంచిగా ఆడుతూ జట్టును లక్ష్యం వైపు నడిపించారు. స్కోరు బోర్డు పరుగులెత్తించారు. వీరిద్దరూ కలిసి నాలుగో వికెట్​కు 72 పరుగులు జోడించారు. ఈ క్రమంలోనే విన్నింగ్ షాట్ కొట్టే ప్రయత్నంలో హర్మన్ ప్రీత్ కౌర్ ఔటైంది. అయితే రిచా ఘోష్ ఫోర్​తో మ్యచ్​ను ముగించింది.

అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 118 పరుగులు చేసింది. విండీస్ ప్లేయర్లలో టేలర్ (40 బంతుల్లో 42; 6x4) టాప్ స్కోరర్​గా నిలిచింది. క్యాంబెల్ (36 బంతుల్లో 30; 3x4) పర్వాలేదనిపించింది. ఆఖర్లో నేషన్ (21*) పరుగులు చేయడంతో విండీస్ 100 పరుగుల మార్కును దాటింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ 3 వికెట్లు తీసింది.

దీప్తి సెంచరీ.. ఇక ఈ మ్యాచ్ లో దీప్తి శర్మ మూడు వికెట్లు తీయడంతో ఓ ఘనత సాధించింది. అంతర్జాతీయ టీ20ల్లో 100 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్​గా నిలిచింది. పూనమ్ యాదవ్ 99 వికెట్లతో ఉండగా.. ఆమెను దీప్తి అధిగమించింది.

ఇదీ చూడండి:టీమ్​ఇండియాలో చోటు కోల్పోవడంపై స్పందించిన గబ్బర్​.. ఏమన్నాడంటే?

Last Updated : Feb 15, 2023, 10:06 PM IST

ABOUT THE AUTHOR

...view details