తెలంగాణ

telangana

ETV Bharat / sports

అదరగొట్టిన టీమ్​ఇండియా.. పాక్​పై ఘన విజయం.. - ఇండియా పాకిస్థాన్ మహిళల టీ20 వరల్డ్​ కప్

మహిళల టీ20 వరల్డ్​ కప్​లో టీమ్ఇండియా బోణీ కొట్టింది. 7 వికెట్ల తేడాతో పాకిస్థాన్​పై ఘన విజయం సాధించింది. జెమీమా రోడ్రిగ్స్, రీచా ఘోష్ అద్భుత ప్రదర్శన చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

womens t20 world cup 2023
womens t20 world cup 2023

By

Published : Feb 12, 2023, 9:43 PM IST

Updated : Feb 12, 2023, 10:09 PM IST

మహిళల టీ20 వరల్డ్​ కప్​లో టీమ్ఇండియా బోణీ కొట్టింది. 7 వికెట్ల తేడాతో పాక్​పై ఘన విజయం సాధించింది. జెమీమా రోడ్రిగ్స్(53), రీచా ఘోష్(31) ఆఖరి వరకు పోరాడి జట్టును విజయతీరాలకు నడిపించారు. షెఫాలి వర్మ(33) రాణించగా.. యాస్తికా భాటియా(17) హర్మన్​ప్రీత్​(16) పరుగులు చేసి ఫర్వాలేదనిపించారు. పాక్​ నిర్దేశించిన 150 పరుగుల లక్ష్యాన్ని 19 ఓవర్లలో 3 వికెట్ల కోల్పోయి ఛేదించారు. ఇక పాక్​ బౌలర్లలో నష్రా సంధు(2) వికెట్ల తీయగా.. సాదియా ఇక్బాల్(1) వికెట్​ పడగొట్టింది.

టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న పాకిస్థాన్​ మహిళల జట్టు.. నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. మరూఫ్​(68*) పరుగులతో అద్భుత ప్రదర్శన చేసింది. ఆయేష నసీమ్​(43*) రాణించింది. మనీబా(12), జావేరి ఖాన్(8), అమీన్(1) అంతగా ఆకట్టుకోలేక పోయారు. నిద దార్​ డక్​ ఔట్​ అయింది. టీమ్​ఇండియా బౌలర్లు రాధ యాదవ్(2) వికెట్లతో రాణించగా.. దీప్తి సర్మ, పూజ వస్త్రాకర్​ చెరో వికెట్​ తీశారు.

Last Updated : Feb 12, 2023, 10:09 PM IST

ABOUT THE AUTHOR

...view details