టీ20 ప్రపంచకప్‌కు ముందు సన్నాహకంగా జరిగిన టోర్నమెంట్‌లో భారత మహిళల జట్టుకు నిరాశ ఎదురైంది. ట్రై సిరీస్ ఫైనల్లో 110పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీ టీమ్ 18ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి 5 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. లీగ్ దశలో మంచి ప్రదర్శన చేసిన భారత జట్టు చివర్లో పేలవ బ్యాటింగ్ ప్రదర్శనతో పరాజయాన్ని అందుకుంది. ఫలితంగా ఈ ముక్కోణపు సిరీస్‌లో ఆతిథ్య దక్షిణాఫ్రికా మహిళలు విజేతలుగా నిలిచారు.
లక్ష్య ఛేదనలో మొదట దక్షిణాఫ్రికా 21 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడినా... 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' నిలిచిన క్లో ట్రైఆన్ (32 బంతుల్లో 57*; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అద్భుతంగా ఆడి జట్టుకు విజయన్ని అందించింది. నదిన్ డి క్లర్క్(17) ఆమెకు అండగా నిలిచింది. స్నేహ్ రాణా 2 వికెట్లు తీసింది. రేణుకా సింగ్, రాజేశ్వరి గైక్వాడ్, దీప్తి శర్మ తలో వికెట్ పడగొట్టారు.