ఒక్క మ్యాచ్‌తో ఆరంభమైంది. మూడు జట్ల ఛాలెంజర్ టోర్నీగా మారింది. ఇప్పుడు పూర్తిస్థాయిలో మహిళల ప్రిమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)గా అవతరించింది. ఇంకా చెప్పాలంటే జట్ల బిడ్డింగ్‌తోనే సన్షేషన్ క్రియేట్ చేసి.. బ్రాడ్ కాస్టింగ్ రైట్స్‌తో రికార్డులు బద్దలు కొట్టి.. ఆక్షన్‌లో అమ్మాయిలపై రూ.కోట్ల కాసుల వర్షం కురిపించి.. ఆరంభానికి ముందే అంచనాలు పెంచేసిన డబ్ల్యూపీఎల్ ఈ రోజు(మార్చి 4) కార్యరూపం దాల్చనుంది. అలా కొత్త చరిత్రకు అడుగు పడనుంది. దీంతో ఈ సూపర్ ఛాన్స్‌ను ఉపయోగించుకుని.. వావ్ అనే ఫీల్డింగ్ విన్యాసాలు.. అదిరిపోయే ధనాధన్ ఇన్నింగ్స్‌లు.. నిప్పులు చెరిగేలా బౌలింగ్ ప్రదర్శనలతో చెలరేగేందుకు అమ్మాయిలు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఈమెగా లీగ్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు మీకోసం..
- 5 జట్లు.. 87 మంది క్రికెటర్లు.. 22 మ్యాచ్‌లు.. 23 రోజుల పాటు ఈ టీ20 పండగ కొనసాగనుంది.
- 15 ఏళ్ల టీనేజర్ల నుంచి సీనియర్ల వరకూ.. వరల్డ్ క్లాస్ టాప్ క్రికెటర్స్ ఈ లీగ్‌లో పాల్గొననున్నారు.
- ముంబయి ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, దిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్ టీమ్స్ పోరుకు సై అంటున్నాయి.
- ఈ నెల 26న జరిగే ఫైనల్ జరగనుంది. ఇందులో గెలిచి డబ్ల్యూపీఎల్ తొలి సీజన్ ట్రోఫీని ముద్దాడాలని ఈ ఐదు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి.
- నేడు(శనివారం) డీవై పాటిల్ స్టేడియం వేదికగా గుజరాత్ జెయింట్స్-ముంబయి ఇండియన్స్ మ్యాచ్‌తో లీగ్ ప్రారంభంకానుంది.
- ఈ సీజన్‌లోని అన్ని మ్యాచ్‌లకు ముంబయిలోని డీవై పాటిల్‌తో పాటు బ్రబౌర్న్ స్టేడియం వేదికలుగా నిర్ణయించారు.
- స్పోర్ట్స్18 నెట్‌వర్క్‌లో మ్యాచ్‌లు బ్రాడ్ కాస్టింగ్ కానున్నాయి. జియో సినిమా యాప్‌లోనూ చూడొచ్చు.
- డబ్ల్యూపీఎల్‌లోని ముంబయి ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, దిల్లీ క్యాపిటల్స్ జట్లు ఇప్పటికే ఐపీఎల్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఐదు ఐపీఎల్ ట్రోఫీలతో అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది ముంబయి. ఇప్పుడీ అమ్మాయిల లీగ్‌లోనూ తొలి సీజన్‌ను గెలవాలనే పట్టుదలతో ఉంది. ఇక ఐపీఎల్‌లో ఇప్పటివరకు ట్రోఫీని అందుకోని ఆర్సీబీ.. కనీసం డబ్ల్యూపీఎల్‌లోనైనా మొదటి సీజన్‌లోనే టైటిల్‌ను దక్కించుకుంటుందా లేదా అనేది చూడాలి. దిల్లీ క్యాపిటల్స్‌ది కూడా ఇదే పరిస్థితి. చూడాలి ఏం జరుగుతుందో.
- ఈ డబ్ల్యూపీఎల్.. డబుల్ రౌండ్ రాబిన్ ఫార్మాట్ ప్రకారం లీగ్ దశలో ప్రతి టీమ్ మిగతా జట్లతో రెండేసి మ్యాచ్‌ల చొప్పున తలపడతుంది. ఇలా ప్రతి టీమ్ ఎనిమిది మ్యాచ్‌లు తలపడేసరికి పాయింట్ల పట్టికలో తొలిస్థానంలో నిలిచిన జట్టు నేరుగా తుదిపోరుకు అర్హత సాధిస్తుంది. రెండు, మూడు స్థానాల్లో ఉన్న టీమ్స్.. ఫైనల్లో చోటు కోసం ఎలిమినేటర్‌లో పోరాడుతాయి. నాలుగు రోజుల్లో రెండేసి చొప్పున మ్యాచ్‌లు జరుగుతాయి.
- మధ్యాహ్నం మ్యాచ్ 3.30, రాత్రి మ్యాచ్ 7.30 గంటలకు ప్రారంభమవుతాయి. మ్యాచ్‌లో ఓ జట్టు మ్యాక్సిమన్ ఐదుగురు ఫారెన్ ప్లేయర్స్‌ను ఆడించొచ్చు. ఒకవేళ టీమ్‌లో ఐసీసీ అసోసియేట్ దేశాలకు చెందిన క్రికెటర్లు ఉంటే కచ్చితంగా ఒకరిని మ్యాచ్‌లో ఆడించాలి. కానీ దిల్లీ జట్టులో మాత్రమే ఈ ఐసీసీ అసొసియేట్ దేశానికి చెందిన క్రికెటర్ తారా నోరిస్ (అమెరికా) ఉంది.
- అంతర్జాతీయ మహిళా క్రికెట్లో, ఇంకా చెప్పాలంటే ముఖ్యంగా టీ20ల్లో ఇప్పటివరకు ఆస్ట్రేలియాదే ఆధిపత్యం. ఇప్పుడు డబ్ల్యూపీఎల్ ప్రారంభ సీజన్లోనూ ఆధిపత్యం చలాయించనుంది. ఆ జట్టుకు చెందిన ముగ్గురు ప్లేయర్లు.. ఈ డబ్ల్యూపీఎల్‌లో పలు జట్లకు కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. యూపీకి అలీసా హీలీ, దిల్లీకి మెగ్ లానింగ్, గుజరాత్‌కు బెత్ మూనీ కెప్టెన్లుగా సెలెక్ట్ అయ్యారు.
- డబ్ల్యూపీఎల్ జట్ల కోసం ఆయా ఫ్రాంఛైజీలు రూ.4,669 కోట్లు ఖర్చు చేశాయి. దీంతో అమెరికాలోని మహిళల ఎన్‌బీఏ తర్వాత ప్రపంచంలోనే రెండో ఖరీదైన లీగ్‌గా డబ్ల్యూపీఎల్ స్థానం దక్కించుకుంది. అత్యధికంగా గుజరాత్ జెయింట్స్ కోసం అదానీ గ్రూప్ రూ.1,289 కోట్లు ఖర్చు చేసింది. వేలంలో క్రికెటర్లను దక్కించుకునేందుకు ఫ్రాంఛైజీలు రూ.59.50 కోట్లు వెచ్చించాయి. అత్యధిక ధరకు అమ్ముడుపోయిన క్రికెటర్ స్మృతి మంధాన(రూ.3.4 కోట్లు) ఆర్సీబీ దక్కించుకుంది.
- ఇకపోతే ఈ సీజన్‌లో అన్ని మ్యాచ్‌లనూ ఫ్రీగా చూసే ఛాన్స్‌ను మహిళలు, బాలికలకు బీసీసీఐ కల్పిస్తోంది. అమ్మాయిలు డబ్బులు చెల్లించకుండానే స్టేడియాలకు వెళ్లి మ్యాచ్‌లను లైవ్‌లో చూడొచ్చు.
- ముంబయి: హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), హీథర్ గ్రాహమ్, నాట్ సీవర్, యాస్తిక భాటియా, పూజ వస్త్రాకర్ కీలక ప్లేయర్స్
- బెంగళూరు: స్మృతి మంధాన(కెప్టెన్), ఎలీస్ పెర్రీ, సోఫీ డెవిన్, రేణుక ఠాకూర్, రిచా ఘోష్ కీలక క్రికెటర్లు.
- గుజరాత్: బెత్ మూనీ(కెప్టెన్), ఆష్లీ గార్డ్‌నర్, డాటిన్, స్నేహ్ రాణా, సోఫియా డంక్లీ కీలకం కీలక ఆటగాళ్లు.
- యూపీ: అలీసా హీలీ(కెప్టెన్), సోఫీ ఎకిల్‌స్టన్, దీప్తి శర్మ, షబ్నిమ్ ఇస్మాయిల్, తహిలా మెక్‌గ్రాత్ కీలక క్రికెటర్లు
- దిల్లీ: మెగ్ లానింగ్(కెప్టెన్), జెమీమా, షెఫాలీ, మరీజనె కాప్ కీలక ప్లేయర్స్.