Womens Premier League 2024 Auction Date : వచ్చే ఏడాది జరగనున్న మహిళల ప్రీమియర్ లీగ్ 2024 సీజన్‌కు బీసీసీఐ సన్నాహాలు మొదలు పెట్టింది. అందులో భాగంగా డిసెంబర్ 9న ముంబయి వేదికగా ఈ ఎడిషన్‌కు సంబంధించి వేలం నిర్వహించనున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ బోర్డు- బీసీసీఐ తెలిపింది. కాగా వచ్చే ఏడాది ఫిబ్రవరి- మార్చి విండోలో ఈ లీగ్ జరిగే అవకాశం ఉంది.
అయితే వేలం నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్ జట్టు 11 మంది ప్లేయర్లను రిలీజ్ చేసింది. దిల్లీ క్యాపిటల్స్ కూడా కొంత మంది ప్లేయర్లను విడుదల చేసింది. అలా ఐదు టీమ్‌లు మొత్తం 29 మందిని రిలీజ్ చేశాడు. ఇక ఇప్పటికే డబ్ల్యూపీఎల్‌లో భాగమైన 60 మంది ఓవర్సీస్ ప్లేయర్లలో 21 మందిని ఐదు ఫ్రాంచైజీలు రిటైన్ చేశాయి. ఇక ప్రస్తుతం ఐదు ఫ్రాంచైజీలు 30 మంది ఆటగాళ్లను (9 మంది విదేశీ క్రికెటర్లు) దక్కించుకునేందుకు రూ.71.65 కోట్లు ఖర్చు చేయనున్నాయి.
ఫ్రాంచైజీ | పర్స్ వాల్యూ | అందుబాటులో ఉన్న స్లాట్స్ |
దిల్లీ క్యాపిటల్స్ | రూ.2.25 కోట్లు | 3 |
గుజరాత్ జెయింట్స్ | రూ.5.95 కోట్లు | 10 |
ముంబై ఇండియన్స్ | రూ.2.1 కోట్లు | 5 |
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు | రూ.3.35 కోట్లు | 7 |
యూపీ వారియర్స్ | రూ.4 కోట్లు | 5 |