తెలంగాణ

telangana

ETV Bharat / sports

INDW vs AUSW: తొలి ఇన్నింగ్స్​ డిక్లేర్ చేసిన టీమ్ఇండియా - భారత్-ఆస్ట్రేలియా డేనైట్ టెస్టు లైవ్ స్కోర్

ఆస్ట్రేలియా మహిళలతో జరుగుతున్న డేనైట్ టెస్టు తొలి ఇన్నింగ్స్​లో 377 పరుగులకు డిక్లేర్ చేసింది భారత మహిళల జట్టు. స్మృతి మంధాన సెంచరీతో మెరిసింది.

INDW vs AUSW Test
టీమ్ఇండియా

By

Published : Oct 2, 2021, 2:23 PM IST

ఆస్ట్రేలియా మహిళలతో జరుగుతున్న డేనైట్ టెస్టులో భారత మహిళల జట్టు తొలి ఇన్నింగ్స్​ను డిక్లేర్ చేసింది. 8 వికెట్ల నష్టానికి 377 పరుగులు చేసి ఆసీస్​కు బ్యాటింగ్ ఎంచుకుంది. స్మృతి మంధాన 127 పరుగులతో సత్తాచాటగా దీప్తి శర్మ (66) ఆకట్టుకుంది. షెఫాలీ (31), పూనమ్ రౌత్ (36), మిథాలీ (30) పర్వాలేదనిపించారు.

వర్షం కారణంగా మొదటి రెండు రోజులు పూర్తి ఆట సాగలేదు. మూడో రోజు దీప్తి శర్మ (66) ఔట్ కాగానే డిక్లేర్ చేసింది భారత్. ఆస్ట్రేలియా బౌలర్లలో సోఫీ మోలినిక్స్ 2, ఎలిస్ పెర్రీ 2, క్యాంప్​బెల్ 2 వికెట్లు సాధించారు.

ఇవీ చూడండి: 'అది షాక్‌కు గురిచేసింది.. ఐపీఎల్‌లో ఇలాంటివి జరగొద్దు'

ABOUT THE AUTHOR

...view details