Women's Ashes Test: మహిళల యాషెస్ సిరీస్‌లో భాగంగా జరిగిన టెస్టు డ్రాగా ముగిసింది. 257 పరుగుల లక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించినా ఇంగ్లాండ్ ఆటగాళ్లు లక్ష్యం పూర్తి చేయలేకపోయారు. దీంతో మ్యాచ్ డ్రా అయింది. ఆ జట్టు ప్లేయర్ హేథర్ నైట్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
తొలి ఇన్నింగ్స్‌లో తొమ్మిది వికెట్లు కోల్పోయి 337 పరుగులు వద్ద డిక్లేర్ చేసింది ఆస్ట్రేలియా. లన్నింగ్స్(93), ఆర్ హైన్స్(86), తహ్లియా మెక్‌గ్రత్(52), గార్డ్నర్(56) అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. ఇంగ్లాండ్ బౌలర్లలో కె బ్రంట్ 5, ఎన్ సీవర్ 3, Shrubsole ఓ వికెట్ తీశారు. ఇంగ్లాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 297 రన్స్‌కు ఆలౌట్ అయింది. హీధర్ నైట్(168*) సెంచరీతో అదరగొట్టింది. మిగతా వారు విఫలమయ్యారు.
దీంతో 40 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించినా ఆస్ట్రేలియా 216/7 వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లాండ్.. తొమ్మిది వికెట్లు కోల్పోయి 245 రన్స్ చేశారు. నటలీ సీవర్(58), హీధర్ నైట్(48), లారెన్ విన్ఫీల్డ్ హిల్(33), టమ్మీ బ్యూమౌంట్(36), సోఫియా డంక్లీ(45) రాణించారు. ఆసీస్ బౌలర్లలో అన్నాబెల్ సదర్‌ల్యాండ్ 3, అలనా కింగ్ 2 వికెట్లు దక్కించుకున్నారు.