Women IPL: ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభానికి ఒక్క రోజు ముందు మహిళల క్రికెట్‌కు సంబంధించిన ఓ గుడ్ న్యూస్ వెలువడింది. పురుషుల ఐపీఎల్ తరహాలోనే వచ్చే ఏడాది నుంచి ఆరు జట్లతో కూడిన మహిళా ఐపీఎల్ నిర్వహించనున్నట్లు బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ శనివారం ప్రకటించారు. ముంబయిలో జరిగిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత కొద్దికాలంగా మహిళల ఐపీఎల్‌కు విపరీతమైన డిమాండ్ ఉన్న నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
వచ్చే ఏడాది నుంచే మహిళల ఐపీఎల్.. ఆరు జట్లతో..
Women IPL: క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. వచ్చే ఏడాది నుంచి మహిళల ఐపీఎల్ నిర్వహించనున్నట్లు బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ ప్రకటించారు. గత కొద్ది రోజులగా మహిళల ఐపీఎల్ నిర్వహించాలని డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
IPL 2022: ఈ నెల 26న ఐపీఎల్ 15వ సీజన్ ప్రారంభం కానుంది. కొత్తగా చేరిన రెండు జట్లతో మొత్తం పది టీమ్‌లు టైటిల్ కోసం తలపడనున్నాయి. జట్ల సంఖ్య పెరిగిన కారణంగా..ఈసారి భిన్న ఫార్మాట్లో టోర్నీ జరగనుంది. గెలిచిన టైటిళ్లు, ఆడిన ఫైనల్స్ ఆధారంగా జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. ముంబయి ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, దిల్లీ క్యాపిటల్స్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ గ్రూప్-ఏలో.. చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ గ్రూప్-బిలో ఉన్నాయి. ప్రతి జట్టు తన గ్రూపులోని జట్లతో రెండేసి మ్యాచ్‌లు, మరో గ్రూపులోని జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. అంటే ప్రతి జట్టూ ఎప్పటిలాగే 14 మ్యాచ్‌లే ఆడుతుంది.
ఇదీ చదవండి:పాక్ చేజారిన సిరీస్.. ఆసీస్ సూపర్ విక్టరీ.. 24 ఏళ్ల తర్వాత!