ఐపీఎల్ రెండో దశను సెప్టెంబర్ మూడో వారంలో యూఏఈలో జరపాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) నిర్ణయించింది. దీనిపై లీగ్ ఫ్రాంఛైజీలు సామాజిక మాధ్యమాల వేదికగా హర్షం వ్యక్తం చేస్తూ పలు పోస్టులు పెట్టాయి.
రాజస్థాన్ రాయల్స్ ఓ అడుగు ముందుకేసి.. ఐపీఎల్ రీషెడ్యూల్పై తమ సంతోషాన్ని ప్రకటించింది. బాలీవుడ్ సినిమా 'హే బేబీ' లోని ఓ పాటను మార్ఫింగ్ చేసింది. సినిమాలోని నటీనటులైనా అక్షయ్ కుమార్, షారుక్ ఖాన్, అనుపమ్ ఖేర్ స్థానాలలో తమ జట్టు ఆటగాళ్లు సంజూ శాంసన్, రాహుల్ తెవాతియా, జోస్ బట్లర్, క్రిస్ మోరిస్.. ఫొటోలను పెట్టింది. ఆ వీడియోను తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది ఫ్రాంఛైజీ.