శ్రీలంక పర్యటన కోసం ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కడంపై ఎమోషనల్‌గా స్పందించాడు యువ బౌలర్ చేతన్ సకారియా. ఇటీవల తన జీవితంలో ఎదురైన ఒడుదొడుకులను తలుచుకొని భావోద్వేగానికి గురయ్యాడు.
"ఎన్నటికైనా టీమ్ఇండియాకు ఆడాలన్నది మా నాన్న కల. అది నేడు నెరవేరబోతోంది. కానీ, ఇది చూడటానికి మా నాన్న ఇక్కడ లేరు. ఈ రోజు ఆయనను చాలా మిస్ అవుతున్నా."
-చేతన్ సకారియా, యువ క్రికెటర్.
"నా సోదరుడిని కోల్పోయిన ఒక నెలకే నాకు ఐపీఎల్ కాంట్రాక్టు వచ్చింది. మా నాన్న చనిపోయిన ఒక నెల తర్వాత ఇప్పుడు టీమ్ఇండియాకు ఆడే అవకాశం వచ్చింది. ఇది నా జీవితంలో పూడ్చలేని లోటు. మా నాన్న కోసం నేను ఆస్పత్రిలో వారం రోజుల పాటు ఉన్నా. నా క్రికెట్ కెరీర్‌కు కృషి చేసిన మా తండ్రితో పాటు మా అమ్మకు ఇది అంకితం" అని సకారియా భావోద్వేగంతో చెప్పాడు.
ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన సకారియా.. లీగ్‌లో గొప్ప ప్రదర్శనే చేశాడు. రాజస్థాన్ తరఫున ఆడిన ఈ యువ బౌలర్.. 7 మ్యాచ్‌ల్లో 7 వికెట్లు తీశాడు.
ఇదీ చదవండి:WTC Final: 'ఆ స్థానంలో నా ఓటు శార్దుల్‌కే'