డబ్ల్యూపీఎల్ వేలం పాట ముగిసిన సంగతి తెలిసిందే. పలువురు ప్లేయర్స్ రికార్డ్ ధరకు అమ్ముడుపోగా.. మరి కొంతమంది అన్‌సోల్డ్‌గా మిగిలిపోయారు. అయితే ఈ టైటిల్ ట్రోఫీ కోసం పోటీ పడే జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒకటి. తాజాగా జరిగిన వేలంలో తొలి ప్లేయర్‌ను ఆర్సీబీనే కొనుగోలు చేసింది. టీమ్ఇండియా వైస్ కెప్టెన్, ఓపెనర్ స్మృతి మంధాన కోసం ముంబయి ఇండియన్స్‌తో గట్టిగా పోటీ పడి మరీ చివరకు రూ.3.4 కోట్లకు కొనుగోలు చేసింది. మొత్తంగా 18 మంది ప్లేయర్లను కొనుగోలు చేసింది.
స్మృతి మంధానతో పాటు ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ ఎలీస్ పెర్రీని కూడా ఆర్సీబీనే కొనేసింది. ఆమె కోసం రూ.1.7 కోట్లు ఖర్చు పెట్టింది. అలాగే డ్యాషింగ్ వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్‌ను రూ.1.9 కోట్లకు, పేస్ బౌలర్ రేణుకా సింగ్‌ను రూ.1.5 కోట్లకు కొనుగోలు చేసింది. అనంతరం న్యూజిల్యాండ్ జట్టు సారథి సోఫీ డివైన్‌ను కేవలం బేస్ ప్రైజ్ రూ.50 లక్షలకే దక్కించుకుంది. వేలం ముగిసిన తర్వాత ఆర్సీబీ పర్సులో ఇంకా రూ.10 లక్షలు మిగిలి ఉన్నాయి.
పూర్తి జట్టు.. స్మృతి మంధాన, సోఫీ డివైన్, ఎలీస్ పెర్రీ, రేణుకా సింగ్, రిచా ఘోష్, ఎరిన్ బర్న్స్, దిషా కసత్, శ్రేయాంక పాటిల్, ఇంద్రాణీ రాయ్, కణకా అహూజా, ఎరిన్ బర్న్స్, ఆశా శోభన, హెతర్ నైట్, డేన్ వాన్ నీకెర్క్, ప్రీతి బోస్, పూనమ్ ఖెమ్నార్, సహానా పవార్, కోమల్ జంజాద్, మేగన్ షూట్.
పటిష్టంగా ముంబయి.. ఇక ముంబయి జట్టు విషయానికొస్తే.. కీలక ఆటగాళ్లను కొనుగోలు చేసింది. స్మృతి మంధాన కోసం గట్టిగా పోటీపడిన ఈ ఫ్రాంచైజీ.. చివరకు ఆమెను మాత్రం కొనలేకపోయింది. అయితే ఆ తర్వాత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ విషయంలో మాత్రం వెనకడుగు వేయలేదు.రూ. 50 లక్షల బేస్ ప్రైజ్‌తో వేలంలోకి వచ్చిన హర్మన్‌ను రూ.1.8 కోట్లకు కొనుగోలు చేసింది. ఇంకా ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ నాట్ సివర్, న్యూజిల్యాండ్ స్టార్ అమీలియా కెర్ కోసం కూడా గట్టిగా పోటీ పడి.. చివరకు సివర్‌ను రూ.3.2 కోట్లకు, కెర్‌ను కోటి రూపాయలకు కొనుగోలు చేసింది. అలాగే టీమ్ఇండియా ప్లేయర్లు పూజా వస్త్రాకర్, యాస్తిక భాటియాను కూడా కొనుగోలు చేసి తమ జట్టును మరింత బలంగా మార్చుకుంది.
పూర్తి జట్టు.. హర్మన్‌ప్రీత్ కౌర్, నటాలీ సివర్, అమీలియా కెర్, పూజ వస్త్రాకర్, యాస్తిక భాటియా, ఇసాబెల్లా వాంగ్, హెతర్ గ్రాహమ్, అమన్‌జోత్ కౌర్, సైకా ఇషాకూ, హేలీ మాథ్యూస్, ధారా గుజ్జర్, క్లో ట్రయాన్, హుమైరా కాజీ, ప్రియాంక బాల, సోనమ్ యాదవ్, నీలమ్ బిస్త్, జింతమని కలిత.
కాగా, మొట్టమొదటిసారి జరగనున్న ఈ మహిళల ఐపీఎల్‌కు వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) అని బీసీసీఐ పేరు ఖరారు చేసింది. ఇందులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబయి ఇండియన్స్, దిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్జ్ జట్లు పోటీ పడుతున్నాయి. ఈ టోర్నీ మార్చి 4 నుంచి 26 వరకు జరుగుతుంది. ఈ టోర్నీ కూడా అభిమానులకు కావలసినంత మజా అందిస్తుందని క్రికెట్ ప్రియులు ఆశిస్తున్నారు.
ఇదీ చూడండి:wpl auction 2023 : కెప్టెన్‌ను దాటేసిన స్మృతి మంధాన.. రూ. కోట్లు పలికిన ప్లేయర్లు వీళ్లే