తెలంగాణ

telangana

ETV Bharat / sports

ICC Rankings: అగ్రస్థానానికి కేన్, కోహ్లీ అదే ర్యాంక్​లో

ఐసీసీ పురుషుల టెస్టు ర్యాంకింగ్స్​లో కేన్ విలియమ్సన్ తిరిగి అగ్రస్థానానికి చేరుకున్నాడు. టీమ్​ఇండియా సారథి కోహ్లీ నాలుగులోనే కొనసాగుతున్నాడు.

kane williamson, virat kohli
విరాట్ కోహ్లీ, కేన్ విలియమ్సన్

By

Published : Jun 30, 2021, 4:04 PM IST

Updated : Jun 30, 2021, 4:30 PM IST

ఐసీసీ పురుషుల లేటెస్ట్ టెస్టు​ ర్యాంకింగ్స్​ను బుధవారం విడుదల చేసింది.​ బ్యాట్స్​మెన్​లో కివీస్​ కెప్టెన్ కేన్ విలియమ్సన్(901)​ తిరిగి టాప్​లోకి వచ్చాడు. ఆసీస్ ఆటగాడు స్టీవ్ స్మిత్ (891) రెండో స్థానానికి పడిపోయాడు. భారత్​తో జరిగిన ప్రతిష్ఠాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్లో రెండు ఇన్నింగ్స్​ల్లో కలిపి 101 పరుగులు చేయడం కివీస్​ కెప్టెన్​కు కలిసొచ్చింది. మరో కివీస్​ బ్యాట్స్​మన్​ రాస్​ టేలర్​ మూడు స్థానాలు మెరుగుపరుచుకుని 14వ స్థానానికి చేరుకున్నాడు. కివీస్ ఓపెనర్​ కాన్వే 18 స్థానాలు మెరుగుపరుచుకుని 42వ ర్యాంకులోకి వచ్చాడు.

టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ర్యాంక్​లో ఏ మార్పు జరగలేదు. అతడు 812 పాయింట్లతో నాలుగో స్థానంలోనే ఉండగా.. రోహిత్ శర్మ ఆరో స్థానంలో, రిషభ్ పంత్ ఏడో ర్యాంకులో ఉన్నారు. వైస్​ కెప్టెన్​ అజింక్య రహానె మూడు స్థానాలు మెరుగుపరుచుకుని 13వ స్థానంలో నిలిచాడు. ఆల్​రౌండర్ల జాబితాలో టీమ్ఇండియా క్రికెటర్ రవీంద్ర జడేజా రెండో స్థానానికి పడిపోయాడు. విండీస్​ ఆటగాడు జేసన్ హోల్డర్​ తిరిగి అగ్రస్థానానికి చేరుకున్నాడు.

బౌలర్ల జాబితాలో న్యూజిలాండ్ ఆటగాడు కైల్ జేమీసన్ కెరీర్​లోనే అత్యుత్తమ స్థానాన్ని పొందాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో ఏడు వికెట్లు తీసిన అతడు.. 13వ స్థానానికి వచ్చాడు. ఐదు వికెట్లతో మెరిసిన ట్రెంట్ బౌల్ట్​ రెండు స్థానాలు ఎగబాకి 11వ స్థానంలో నిలిచాడు. ​

ఇదీ చదవండి:రోహిత్​కు సారీ చెప్పిన అతడి భార్య రితిక?

Last Updated : Jun 30, 2021, 4:30 PM IST

ABOUT THE AUTHOR

...view details