తెలంగాణ

telangana

By

Published : Jun 15, 2021, 11:29 AM IST

ETV Bharat / sports

WTC Final: కోహ్లీసేనతో తలపడనున్న టీమ్​ ఇదే

ఐసీసీ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​(WTC Final)లో ఆడే ఆటగాళ్ల జాబితాను న్యూజిలాండ్​ ప్రధానకోచ్​ గ్యారీ స్టీడ్​(Gary Stead) మంగళవారం విడుదల చేశాడు. గాయాల కారణంగా ఇంగ్లాండ్​తో జరిగిన రెండో టెస్టుకు దూరమైన కెప్టెన్​ కేన్​ విలియమ్సన్(Kane Williamson)​, వికెట్​ కీపర్​ బీజే వాట్లింగ్​(BJ Watling).. తిరిగి జట్టులోకి వచ్చారు.

Williamson available to lead New Zealand in WTC final against India: Head coach Stead
WTC Final: కోహ్లీసేనతో తలపడనున్న జట్టు ఇదే!

టీమ్ఇండియాతో టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్(WTC Final) కోసం ఆటగాళ్ల జాబితాను మంగళవారం విడుదల చేశాడు న్యూజిలాండ్​ క్రికెట్​ ప్రధానకోచ్​ గ్యారీ స్టీడ్(Gary Stead). భారత్​తో తుదిపోరుకు ఆడనున్న స్క్వాడ్​లో 15 మందికి ఎంపిక చేశారు. అయితే​ గాయాల కారణంగా ఇటీవలే ఇంగ్లాండ్​తో రెండో టెస్టుకు దూరమైన కేన్​ విలియమ్సన్(Kane Williamson)​​, వికెట్​ కీపర్​ బీజే వాట్లింగ్ ఈ మ్యాచ్​కు అందుబాటులో ఉండనున్నారు. మ్యాచ్​ సమయానికి వీరిద్దరూ అందుబాటులో ఉంటారని కోచ్​ గ్యారీ స్టీడ్​ వెల్లడించాడు.

"కేన్​ విలియమ్సన్​, బీజే వాట్లింగ్​ గాయాల కారణంగా వారం నుంచి విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రస్తుతం వారిద్దరూ కోలుకుంటున్నారు. టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​కు వీరిద్దరూ ఫిట్​గా మారి అందుబాటులో ఉంటారని భావిస్తున్నా. ప్రపంచకప్​ ఫైనల్​లో ఆడడం ప్రత్యేక సందర్భం. సౌథాంప్టన్​ వేదికగా టీమ్ఇండియాతో తలపడేందుకు మా ఆటగాళ్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు".

- గ్యారీ స్టీడ్​, న్యూజిలాండ్​ ప్రధానకోచ్​

ఇంగ్లాండ్​తో టెస్టు సిరీస్​ నెగ్గినా.. టీమ్ఇండియాతో ఆడాలంటే న్యూజిలాండ్​ ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాలని గ్యారీ స్టీడ్​ అన్నాడు. న్యూజిలాండ్​ టీమ్​లోని 20 మంది ఆటగాళ్లలో ఐదుగుర్ని పక్కనపెట్టి.. 15 మందితో టెస్టు ఛాంపియన్​షిప్​ టీమ్​ను ఎంపికచేశారు. టీమ్ నుంచి తప్పుకున్న వారిలో డౌగ్​ బేస్వెల్​, జాకప్​ డఫీ, డారిల్​ మిచెల్​, రాచిన్​ రవీంద్ర, మిచెల్​ శాంటర్న్​ ఉన్నారు.

న్యూజిలాండ్​ స్క్వాడ్​:

కేన్​ విలియమ్సన్​(కెప్టెన్​), టామ్​ బ్లండెల్​, ట్రెంట్​ బౌల్ట్​, డెవాన్​ కాన్వే, కాలిన్​ డీ గ్రాండ్​హోమ్​, మ్యాట్​ హెన్రీ, కైలీ జెమిసన్​, టామ్​ లతమ్​, హెన్రీ నికోలస్​, అజాజ్​ పటేల్​, టిమ్​ సౌథీ, రాస్​ టేలర్​, నీల్​ వాగ్నర్​, బీజే వాట్లింగ్​, విల్​ యంగ్​.

ఇదీ చూడండి..WTC Final: టీమ్ఇండియాకు ఐదుగురు శత్రువులు!

ABOUT THE AUTHOR

...view details