టీ20 ప్రపంచకప్ తర్వాత పొట్టి ఫార్మాట్ సారథ్య బాధ్యతల(virat kohli t20 captaincy record)కు గుడ్‌బై చెప్పబోతున్నట్లు ప్రకటించి అభిమానులను షాక్‌కు గురిచేశాడు టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ. పనిభారాన్ని తగ్గించుకునేందుకే ఈ విధంగా చేసినట్లు వెల్లడించాడు. అయితే ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు కోహ్లీ వ్యాఖ్యలను సమర్థిస్తుంటే.. మరికొందరు ఐపీఎల్ కెప్టెన్సీపై ప్రశ్నిస్తున్నారు. అంతర్జాతీయ టీ20ల కన్నా ఐపీఎల్ సారథ్యం(virat kohli ipl captaincy record) వల్ల కూడా ఒత్తిడి పెరుగుతుందని గుర్తు చేస్తున్నారు. దీనిపై ఓ బీసీసీఐ అధికారి మాట్లాడారు.
"విరాట్ కోహ్లీ(virat kohli news) నుంచి వచ్చిన ప్రకటన ఎలాంటిదో అర్థం కావడం లేదు. ఈ నిర్ణయం వల్ల పనిభారం తగ్గిందని అనుకుంటున్నాడా? కరోనా కారణంగా డిసెంబర్ 2020 నుంచి ఇప్పటివరకు టీమ్ఇండియా 8 టీ20లు మాత్రమే ఆడింది. వీటికంటే ఐపీఎల్ మ్యాచ్(ipl match)లే ఎక్కువగా జరిగి ఉండొచ్చు. ఐపీఎల్ కెప్టెన్సీ కూడా చిన్న విషయమేమీ కాదు. టోర్నీని క్షుణ్ణంగా గమనిస్తే అది మీకే అర్థమవుతుంది. మ్యాచ్‌లు, టైటిల్ గెలవాలన్న ఫ్రాంచైజీల ఒత్తిడి కూడా విపరీతంగా ఉంటుంది. మరి ఆర్సీబీ కెప్టెన్సీ(virat kohli rcb captain)ని కూడా కోహ్లీ వదిలేస్తాడా? మూడు ఫార్మాట్ల (వన్డే, టెస్టు, ఐపీఎల్)కూ ఇంకా అతడు సారథ్యం వహిస్తున్నందున ఇప్పటికీ పని భారం తగ్గలేదనే భావిస్తున్నా."
-ఓ బీసీసీఐ అధికారి