తెలంగాణ

telangana

ETV Bharat / sports

సౌతాఫ్రికా మ్యాచ్​లో ఆర్సీబీ ప్లేయర్ సంచలనం - 41 బంతుల్లో శతకం​ - విల్​ జాక్స్ ఆర్సీబీ ప్లేయర్

Will Jacks Century : ఆర్సీబీకి చెందిన స్టార్ బ్యాటర్ విల్ జాక్స్ తాజాగా సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో చెలరేగిపోయాడు. గురువారం జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగి కేవలం 41 బంతుల్లో సెంచరీ బాదాడు. ఇంతకీ మ్యాచ్​ ఎలా సాగిందంటే ?

Will Jacks Century
Will Jacks Century

By ETV Bharat Telugu Team

Published : Jan 19, 2024, 3:29 PM IST

Will Jacks Century :ఇంగ్లాండ్ జట్టుకు చెందిన స్టార్ బ్యాటర్ విల్ జాక్స్ తాజాగా ఓ నయా రికార్డును నెలకొల్పాడు. మినీ ఐపీఎల్‌ను తలపించే సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో శతకం బాది తన సత్తా చాటాడు. 41 బంతుల్లో 8 ఫోర్లు, 9 సిక్సర్ల బాదిన ఈ స్టార్​ ప్లేయర్​ సౌతాఫ్రికా టీ20లో వేగవంతమైన శతకాన్ని నమోదు చేసిన ప్లేయర్​గా రికార్డుకెక్కాడు. అంతే కాకుండా తన సూపర్​ ఇన్నింగ్స్​తో జట్టును విజయ తీరాలకు చేర్చాడు. మ్యాచ్​ వేదికైన సెంచూరియన్‌ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా లేకపోయినప్పటికీ విల్​ అద్భుతంగా రాణించాడు. కేవలం 23 బంతుల్లోనే జాక్వెస్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఆ తర్వాత వేగంగా సెంచరీని చేరుకున్నాడు.

మ్యాచ్​ సాగిందిలా:
తొలుత బ్యాటింగ్​కు దిగిన ప్రిటోరియా క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 204 పరుగుల స్కోర్ చేసింది. ఇక విల్​ జాక్స్‌కు తోడుగా ఈ మ్యాచ్​లో కొలిన్ ఇన్‌గ్రామ్(43)రాణించాడు. ఆ తర్వాత లక్ష్యచేధనకు దిగిన డర్బన్ సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 187 పరుగులే చేయగలిగింది. మాథ్యూ బ్రీట్జ్‌కే(33), క్వింటన్ డికాక్(25) ఆడినప్పటికీ డర్బన్​ జట్టు ఓటమిని చవిచూసింది. ఇక సూపర్ జెయింట్స్ బౌలర్లలో రీస్ టోప్లీ మూడు వికెట్లు తీయగా, మార్కస్ స్టోయినీస్, కేశవ్ మహరాజ్, జూనియర్ డాలా, కీమో పాల్, డ్వేన్ ప్రిటోరియస్ చెరో వికెట్ తీశారు.

Will Jacks RCB : మరోవైపు ఈ గేమ్ స్టార్​గా నిలిచిన విల్​ జాక్స్​ ఐపీఎల్​లో ఆర్సీబీ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇప్పటికే ఆర్సీబీ ప్లేయర్లు పలు టోర్నీల్లో నిలకడగా రాణిస్తుండటం చూసి ఆ జట్టు అభిమానులు ఆనందంతో గంతులేస్తున్నారు. విరాట్ కోహ్లి, రజత్ పటీదార్, సుయాశ్​ ప్రభుదేశాయ్‌లు వివిధ ఫార్మాట్లలో పరుగుల వరద పారిస్తుండగా తాజాగా ఈ లిస్ట్​లోకి విల్ జాక్స్ వచ్చాడు. దీంతో ఈ సారి ఐపీఎల్​ మరింత రసవత్తరంగా సాగనుందంటూ ఆర్సీబీ ఫ్యాన్స్​ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

IPL 2024 : బాంగర్​ పోయే.. అండీ వచ్చే.. RCBకి కొత్త కోచ్​.. ఈ సారైనా కప్పు కొట్టేనా?

ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు..25 బంతుల్లో శతకం

ABOUT THE AUTHOR

...view details