తెలంగాణ

telangana

ETV Bharat / sports

CRICKET RECORD: 52 ఏళ్ల వయసులో టెస్టు ఆడిన క్రికెటర్ - Cricket Facts

లేటు వయసులోనూ అంతర్జాతీయ క్రికెట్​ ఆడి, సరికొత్త రికార్డు సృష్టించాడు ఆ క్రికెటర్. 52 ఏళ్లప్పుడు తన చివరి టెస్టులో పాల్గొన్నాడు. ఇంతకీ ఆ ఆటగాడు ఎవరు?

Wilfred Rhodes played Test cricket till he was 52
విల్ఫ్రెడ్​ రోడ్స్

By

Published : May 28, 2021, 8:00 AM IST

ఫిట్​నెస్​ లేకపోతే ఏ ఆటలోనైనా సరే రాణించడం కష్టం. క్రికెట్​లో అయితే సదరు ప్లేయరు పరుగులు చేయలేకపోయినా, మైదానంలో దూకుడుగా ఉండకపోయినా.. అతడిని పక్కన పెట్టేస్తారు. దాంతో రిటైర్మెంట్​ తీసుకోవాలంటూ విమర్శకులు అతడిపై ఒత్తిడి తీసుకొస్తారు. గత కొన్నేళ్లలో ఇలాంటి అనుభవం ధోనీకి ఎదురైంది. గతేడాది ఆగస్టు 15న తన 38 ఏళ్ల వయసులో క్రికెట్​కు వీడ్కోలు పలికాడు. అయితే గతంలో ఓ బ్యాట్స్​మన్ దాదాపు 52 ఏళ్ల వయసు వరకు క్రికెట్​లో కొనసాగాడు అంటే నమ్మగలరా?

ఇంగ్లాండ్ యార్క్​షైర్​కు చెందిన విల్ఫ్రెడ్​ రోడ్స్.. 52 ఏళ్ల 165 రోజుల వయసులో తన చివరి టెస్టు ఆడాడు. తద్వారా ఎక్కువ వయసులో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్​లో పాల్గొన్న ప్లేయర్​గా నిలిచాడు.

విల్ఫ్రెడ్​ రోడ్స్

మొత్తంగా తన కెరీర్​లో 58 టెస్టులాడిన రోడ్స్.. 2,325 పరుగులు చేశాడు. ఇందులో రెండు శతకాలు, 11 అర్ధ శతకాలు ఉన్నాయి. అలానే అత్యధికంగా 1110 ఫస్ట్​క్లాస్ మ్యాచ్​లాడి 39, 969 పరుగులు చేశాడు. అలానే రికార్డు స్థాయిలో 4204 వికెట్లు తీశాడు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details