WI vs Ban Test Series: ఊహించినట్లే ఐపీఎల్‌లో ఆడే దక్షిణాఫ్రికా ఆటగాళ్లకు బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ నుంచి మినహాయింపు లభించింది. సొంతగడ్డపై జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం శుక్రవారం 15 మంది సభ్యుల జట్టును క్రికెట్ దక్షిణాఫ్రికా (సీఎస్‌ఏ)ప్రకటించింది. రబాడ, ఎంగిడి, మార్కో జాన్సెన్, మార్‌క్రమ్, డసెన్‌ల సేవల్ని దక్షిణాఫ్రికా కోల్పోనుంది. ఐపీఎల్‌లో ఆడాలా? టెస్టు సిరీస్‌లో బరిలో దిగాలా? అన్నది ఆటగాళ్లకే వదిలేస్తున్నట్లు సీఎస్‌ఏ స్పష్టంచేసింది. ఆటగాళ్లు లీగ్ వైపే మొగ్గుచూపారు. సీఎస్‌ఏతో దక్షిణాఫ్రికా క్రికెటర్ల సంఘం (ఎస్‌ఏఎస్‌ఏ) ఒప్పందం ప్రకారం ఐపీఎల్‌లో పాల్గొనకుండా బోర్డు అడ్డుకోకూడదు. ఆటగాళ్ల జీవనోపాధి, అవకాశాలు.. జాతీయ జట్టుకు వారి సేవల్ని రెండు సంస్థలు సమన్వయం చేసేందుకు ప్రయత్నించాలి. ఈనెల 31న డర్బన్‌లో తొలి టెస్టు, ఏప్రిల్ 7న పోర్ట్ ఎలిజబెత్‌లో రెండో టెస్టు ప్రారంభమవుతాయి.
బంగ్లాతో సిరీస్‌కు దక్షిణాఫ్రికా జట్టు ఎంపిక.. ఐపీఎల్‌లో ఆటగాళ్లు లేకుండానే! - undefined
WI vs Ban Test Series: ఐపీఎల్‌లో ఆడే దక్షిణాఫ్రికా ఆటగాళ్లకు బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ నుంచి మినహాయింపు లభించింది. ఈ మేరకు శుక్రవారం 15 మంది సభ్యుల జట్టును క్రికెట్ దక్షిణాఫ్రికా (సీఎస్‌ఏ)ప్రకటించింది.
దక్షిణాఫ్రికా
జట్టు: డీన్ ఎల్గర్ (కెప్టెన్), బవుమా (వైస్ కెప్టెన్), డుపావిలాన్, సారెల్ ఎర్వీ, సైమన్ హార్మర్, కేశవ్ మహరాజ్, ముల్డర్, ఒలివియర్, కీగన్ పీటర్సన్, రికెల్‌టన్, సిపామ్లా, స్టుర్‌మన్, కైల్ వెరెనీ (వికెట్ కీపర్), లిజాడ్ విలియమ్స్, ఖాజా జోండో
ఇదీ చదవండి:మైదానంలో కుప్పకూలిన విండీస్ పేసర్.. తర్వాత ఏమైందంటే?
TAGGED:
WI vs Ban Test Series