తెలంగాణ

telangana

ETV Bharat / sports

రోడ్ సేఫ్టీ సిరీస్​కు సచిన్ దూరం.. అదే కారణం - క్రికెట్ న్యూస్

Sachin news: పాత బకాయిలు చెల్లించని కారణంగా రోడ్ సేఫ్టీ సిరీస్​కు సచిన్ దూరమయ్యారు. ఈ విషయాన్ని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.

sachin news
సచిన్

By

Published : Jan 21, 2022, 7:59 AM IST

Road safety series: అంతర్జాతీయ మాజీ క్రికెటర్లు బరిలో దిగే 'రోడ్డు భద్రత ప్రపంచ సిరీస్‌' టోర్నీ రెండో సీజన్‌కు దిగ్గజ ఆటగాడు సచిన్‌ తెందుల్కర్‌ దూరంగా ఉండనున్నాడు. సచిన్‌తో సహా తొలి సీజన్‌లో పాల్గొన్న చాలామంది ఆటగాళ్లకు బకాయిలు పెండింగులో ఉండటమే ఇందుకు కారణం.

తొలి సీజన్‌కు సచిన్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా, సునీల్‌ గావస్కర్‌ టోర్నీ కమిషనర్‌గా వ్యవహరించారు. "రోడ్డు భద్రత సిరీస్‌ రెండో సీజన్‌లో సచిన్‌ ఆడట్లేదు. మార్చి 1 నుంచి 19 వరకు యూఏఈలో టోర్నీ జరుగనుంది. సచిన్‌ ఏ రకంగానూ టోర్నీలో భాగం కావడం లేదు. సచిన్‌తో సహా చాలామందికి నిర్వాహకులు బకాయిలు చెల్లించలేదు" అని సచిన్‌ సన్నిహిత వర్గాలు తెలిపాయి.

ABOUT THE AUTHOR

...view details